Rashmika – VD: విజయ్ ను చూసి భయపడ్డా.. షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక..!

Rashmika.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, అందంతో యువతను ఉర్రూతల ఊహించడమే కాదు ఎంతోమంది ప్రేక్షక ఆదరాభిమానాలు దక్కించుకొని మరెంతోమంది యువతకు క్రష్ గా మారిపోయింది. ఇకపోతే వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న రష్మిక గీతాగోవిందం సినిమా సమయం నుంచే ఎఫైర్ రూమర్స్ లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. సహా నటుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఈమె ప్రేమాయణం కొనసాగిస్తోందని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయితున్నాయి. కానీ ఈ విషయంపై అప్పుడప్పుడు వీరిచ్చే ఇంటర్వ్యూలు కూడా నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరొకసారి విజయ్ దేవరకొండపై షాకింగ్ కామెంట్లు చేసింది.

Rashmika - VD: Scared to see Vijay.. Rashmika made shocking comments..!
Rashmika – VD: Scared to see Vijay.. Rashmika made shocking comments..!

మొదట్లో విజయ్ ను చూసి భయపడ్డా..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరైన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రష్మిక మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎవరితోనైనా మొదటిసారి మాట్లాడాలి అంటే నాకు చాలా భయం వేసేది. ఒకటి రెండు రోజులైతే తప్ప నేను వారితో కలిసి పోయేదాన్ని కాదు. ఇది సినిమా ఇండస్ట్రీలోనే కాదు నా నిజజీవితంలో కూడా ఇదే జరుగుతుంది.. కానీ గీతా గోవిందం సినిమా సమయంలో విజయ్ దేవరకొండ తో కలిసి నటించడానికి నేను చాలా ఇష్టపడ్డాను..ఆయన చాలా కూల్ గా ఉంటారు. ముఖ్యంగా విజయ్ సెట్ లో ఉన్నాడంటే వాతావరణం కూడా చాలా పాజిటివ్ గా ఉంటుంది.. విజయ్ దేవరకొండ ని చూసినప్పుడు మొదట్లో అలాగే భయపడ్డాను.. కానీ ఆ తర్వాత ఆయనతో కలిసి నటించడం చాలా ఈజీ అనిపించింది. మూవీ షూటింగ్ కూడా చాలా సాఫీగా సాగిపోయింది అంటూ రష్మిక కామెంట్లు చేసింది.

ఎట్టకేలకు ప్రేమపై క్లారిటీ..

ఇకపోతే రష్మిక ఇలా కామెంట్లు చేయడంతో ఎట్టకేలకు ఓపెన్ అయిపోయింది. విజయ్ పై తనకున్న ప్రేమను బయట పెట్టేసింది అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతమందితో కలిసి ప్రయాణం చేసినప్పుడు ఈమెకు భయం కలిగిందా? ఒక విజయ్ తోనే ఈమె షూటింగ్స్ సాఫీగా సాగిందా? అంటూ కూడా ట్రోల్స్ చేసేవారు లేకపోలేదు. మొత్తానికైతే విజయ్ పై తన ప్రేమను ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసింది అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

తొలి సినిమా ప్రయాణం.

వీరిద్దరి కాంబినేషన్ విషయానికి వస్తే.. వీరిద్దరూ మొదటిసారి గీతగోవిందం సినిమాలో కలిసి నటించారు
వీరిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగా పండింది..అందుకే సినిమా సూపర్ హిట్ అయింది. అక్కడి నుంచే వీరిద్దరిపై రూమర్స్ మొదలయ్యాయి. దీనికి తోడు డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా వీరిద్దరూ నటించారు. ఒకసారి లవ్, ఒకసారి ఎంగేజ్మెంట్, మరొకసారి ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రష్మిక, విజయ్ దేవరకొండ కాంబినేషన్ సెట్ పై చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎవరికి వారు వరుస బ్లాక్ బాస్టర్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పూర్తిగా కెరియర్ పైన దృష్టి పెట్టిన వీరు నిజంగానే పెళ్లి చేసుకుంటారా లేక స్నేహితులుగానే ఉండిపోతారా అన్నది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు