Rashmika – Vijay Devarakonda : ఫైనల్‌గా దేవరకొండ ఫ్యామిలీలో కలిసిపోయిన రష్మిక… అందరి ముందు మైక్ పట్టుకుని అనౌన్స్

Rashmika – Vijay Devarakonda :రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు బేబీ సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చిన హీరో ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు గం గం గణేశా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.. తాజాగా ఈ సినిమా మే 31వ తేదీన విడుదల చేస్తున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ చేపడుతున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా ప్రజలతో మమేకం అవుతూ పబ్లిక్ లో తమ సినిమాకు హైప్ తీసుకురావడానికి ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ తో కలిసి తెగ ప్రమోషన్స్ చేపడుతున్నారు ఆనంద్ దేవరకొండ.

గం గం గణేశా ప్రమోషన్స్ లో రష్మిక..

Rashmika - Vijay Devarakonda : Rashmika, who finally joined the Devarakonda family... held the mic and announced in front of everyone.
Rashmika – Vijay Devarakonda : Rashmika, who finally joined the Devarakonda family… held the mic and announced in front of everyone.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఇప్పటికే రష్మిక మందన్న విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉందని వార్తలు రోజు వినిపిస్తూనే ఉంటాయి.. ఇక ఇప్పుడు రష్మిక రెండోసారి ఆనంద్ సినిమా ప్రమోషన్స్ కోసం రావడంతో ఈవెంట్ పై కూడా అందరికీ ఆసక్తి ఏర్పడింది.. ఇక ఈవెంట్ లో భాగంగా రష్మికను పలు ప్రశ్నలు అడిగారు ఆనంద్ దేవరకొండ.. ముఖ్యంగా రష్మికను.. విజయ్ దేవరకొండ అభిమానులు ముద్దుగా వదినమ్మ అని పిలుచుకుంటున్న విషయం తెలిసిందే.. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వదినమ్మను ఒక ఆట ఆడుకున్నాడు మరిది అంటూ కొన్ని ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ..

ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ అన్న రష్మిక..

దీనికి తోడు సోషల్ మీడియాలో ఈమె పలు పెట్ డాగ్స్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అందులో విజయ్ పెట్ డాగ్ కూడా ఉంది. వాటిలో రష్మిక పెట్ డాగ్ తో పాటు విజయ్ దేవరకొండ పెంపుడు కుక్క కూడా ఉంది.. ఇక ఫోటోలు చూపించి వాటిలో ఏది ఫేవరెట్ అని అడగ్గా రష్మిక మాట్లాడుతూ తన పెట్ డాగ్ ఆరా తన ఫస్ట్ బేబీ అని.. విజయ్ దేవరకొండ పెట్ డాగ్ స్టార్మ్ తన సెకండ్ బేబీ అని చెప్పడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ఇక తర్వాత నీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు అని అడగడంతో రష్మిక.. కాసేపు మైక్ పక్కన పెట్టి నీ య** బ్బా అంటూ ఆనంద్ ను సరదాగా తిట్టేసింది.. ఇక వెంటనే మైక్ పట్టుకొని..” ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా” అని చెప్పడంతో అక్కడకు వచ్చిన అభిమానులంతా అరుపులతో సందడి చేశారు..

- Advertisement -

రౌడీ హీరోతో రిలేషన్ పై క్లారిటీ..

అయితే ఈవెంట్ కి వచ్చిన జనాలు అంతా రౌడీ.. రౌడీ స్టార్.. అని అరవడంతో రష్మిక రౌడీ బాయ్ నా ఫేవరెట్ అని .. విజయ్ ని ఉద్దేశించి చెప్పింది.. ఇలా ఈవెంట్ మొత్తం సరదాగా సాగడంతో ఆనంద్ , రష్మిక మధ్య మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే ఆనంద్ ని నువ్వు నా ఫ్యామిలీ రా అని చెప్పడంతో విజయ్, రష్మిక ఎంత క్లోజ్ అనేది ఇప్పుడు మరోసారి తెలుస్తోంది అంటూ అటు నెటిజన్స్ ఇటు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికైతే రష్మిక , విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్ ని రష్మిక ఈ విధంగా క్లారిటీ ఇచ్చింది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు