Ravanasura : రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. అందులో సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా “రావణాసుర” అనే చిత్రం ఒకటి. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దీక్ష నగార్కర్, పూజిత పొన్నాడ. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే హీరో సుశాంత్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు.

అభిషేక్ పిక్చర్స్, ఆర్జీ టీం వర్క్ బ్యానర్స్ పై ఈ సినిమా నిర్మితమవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్, బీన్స్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే దీపావళి కానుకగా ఈ చిత్రం నుండి ఓ బిగ్ అప్డేట్ ని విడుదల చేసింది మూవీట్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేస్తున్నట్లు దీపావళి కానుకగా ప్రకటించింది మూవీ యూనిట్. ఈ మేరకు పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఏప్రిల్ 7 వరకు ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు