Rave party: హేమాను వదలని సీసీబీ.. మరోసారి నోటీసులు.. సహకరిస్తుందా..?

Rave party..గత వారం రోజుల నుంచి నటి హేమా గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా హేమ బెంగళూరు ఫామ్హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హాజరయ్యింది.. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కూడా లభ్యమయ్యాయి కానీ ఆమె మాత్రం తాను అక్కడికి కూడా హాజరు కాలేదని ఒక సెల్ఫీ వీడియో తో పాటు బిర్యానీ వీడియో కూడా షేర్ చేయడంతో ఈ విషయం కలకలం సృష్టించింది అంతేకాదు ఈమె చెబుతున్నది అబద్ధం అంటూ బెంగళూరు పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో సహా ఆమె పార్టీకి హాజరైనట్లు వెల్లడించారు..ఆ తర్వాత పోలీసులు విచారణ చేయగా హేమా కూడా డ్రగ్స్ తీసుకుందని..అందుకు ఆమె బ్లడ్ శాంపుల్లో ఆనవాళ్లు కనిపించాయని తెలియజేయడంతో ఒకసారిగా తెలుగు ఇండస్ట్రీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది..

హేమాకు నోటీసులు..

Rave party: CCB who did not leave Hema.. notices once again.. will it cooperate..?
Rave party: CCB who did not leave Hema.. notices once again.. will it cooperate..?

దీంతో ఈమెను కూడా విచారణకు హాజరుకావాలని నోటీసులు కూడా జారీ చేశారు సీసీబీ..దాదాపుగా నటి హేమా తో పాటు 86 మందికి నోటీసులను జారీ చేశారు.. అయితే హేమా ఈ నెల 27వ తేదీన హాజరు కావలసి ఉండగా.. తనకు వైరల్ ఫీవర్ వచ్చింది అంటూ.. తాను హాజరు కాలేనంటూ ఒక లేఖ ద్వారా తెలియజేసింది.

మరోసారి నోటీసులు..

అయితే ఈ విషయాన్ని సీసీబీ అధికారులు పట్టించుకోకుండా.. ఖచ్చితంగా జూన్ 1వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ మళ్ళీ ఈ రోజున నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 10 రోజులపాటు పోలీస్ కస్టడీలో ఉండేందుకు కోర్టు కూడా ఆదేశాలను ఇచ్చిందట.

- Advertisement -

హేమాను వదిలేయాలంటూ రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి..

దీంతో నిన్నటి రోజున సీసీబీ అధికారులు విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు.. రేవ్ పార్టీలో డ్రగ్స్ సరఫరా చేసిన వారిని పట్టుకునేందుకు లక్ష్యంగా పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నటి హేమాను మాత్రం వదిలేయాలంటూ చాలామంది రాజకీయ నాయకులు కూడా బెంగళూరు పోలీసులకు ఫోన్ చేసి మరి బెదిరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కేవలం హేమా గురించి ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా హేమాకి సపోర్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు.

సమస్య నుంచి హేమా తప్పించుకుంటుందా..

గత కొంతకాలంగా హేమా సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువగానే సినిమాలలో నటిస్తోంది ..గతంలో ఎక్కువగా నటించినప్పటికీ ఈమధ్య కాలంలో అవకాశాలు రావడం లేదు. కానీ అప్పుడప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటుంది హేమా.. ఇటీవలే గత ఏడాది హైదరాబాదు రేవు పార్టీలో కూడా దొరికిన ఈమె.. గుంటూరు రేవ్ పార్టీలో కూడా దొరికింది అయితే ఆ రెండు సార్లు తప్పించుకుంది కానీ ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీ నుంచి తప్పించుకోలేకపోయింది హేమా.. ఇక్కడ ఏకంగా ఈమె డ్రెస్ తీసుకున్నట్లు ఆధారాలతో సహా రుజు అవ్వడంతో సిసిబి నోటీసులు పంపిస్తోంది మరి ఇప్పటికైనా ఏమి సహకరిస్తుందా లేక మొన్న చెప్పినట్టుగానే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా హేమా చేసిన పనికి అటు ఇండస్ట్రీ వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు