Raveena Tandon: క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేసిన కేజిఎఫ్ నటి.!

Raveena Tandon.. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), కన్నడ హీరో యష్ (Yash) కాంబినేషన్లో వచ్చిన చిత్రం కేజిఎఫ్ (KGF) ఈ సినిమాలు ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇందులో కీలకపాత్రలో పోషించిన రవీనాటాండన్ (Raveena Tandon) మరొకసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమై తనను తాను కొత్తగా చూపించుకుంది. ఇందులో ఈమె పెర్ఫార్మెన్స్ పీక్స్ అనే చెప్పాలి. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పింది.

Raveena Tandon: KGF actress who made sensational comments on casting couch.!
Raveena Tandon: KGF actress who made sensational comments on casting couch.!

క్యాస్టింగ్ కౌచ్ పై రవీనా కామెంట్స్..

నిజానికి సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఎక్కువగా ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీలో జస్టిస్ హేమా (Justice hema) కమిటీ ఒక నివేదిక సమర్పించిన తర్వాత అన్ని ఇండస్ట్రీల సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకు వస్తూ తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి బయటకు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ,కోలీవుడ్, శాండిల్ వుడ్ అనే తేడా లేకుండా చాలామంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి తాము ఫలానా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నాము అంటూ చెప్పుకొచ్చారు. ఇక అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ రవీనా టాండన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించి సంచలన కామెంట్లు చేశారు.

నచ్చకపోతే నెగిటివ్ గా చూపిస్తారు.

రవీనా మాట్లాడుతూ.. బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు తమ మాట వినని నటీనటులను తొక్కి పారేస్తారంటూ కూడా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా టాలెంటెడ్ నటులపై ముందుగా పొగరు అనే ముద్ర వేస్తారని , ఆ తర్వాత బిహేవియర్ బాగా లేదంటూ తమకు అనుకూలమైన పత్రికలలో వార్తలు రాయించి వారి క్యారెక్టర్ ను దెబ్బతీస్తూ ఉంటారంటూ తెలిపింది. అంతేకాదు తన కెరీర్ను కూడా చాలామంది నాశనం చేయాలని చూశారని, చాలామంది ఎన్నో రకాల కుట్రలు చేశారు అంటూ చెప్పుకొచ్చింది. దీని వెనుక పెద్ద కారణమే ఉంది అని చెప్పుకొచ్చింది రవీనా టాండన్.

- Advertisement -

బెడ్ రూమ్ వరకు వెళ్లలేదని కక్ష సాధించారు..

నేను వాళ్ళ బెడ్ రూమ్ వరకు వెళ్లలేదని నాపై కక్ష సాధించారు . వాళ్ళ లైంగిక కోరికలు నేను తీర్చలేదని కసితో నాపై లేనిపోని బురద చల్లే ప్రయత్నాలు చేశారు అంటూ అసలు నిజాన్ని బయటపెట్టింది. కేవలం పడక సుఖం కోసమే హీరోయిన్ల కెరియర్లను నాశనం చేసే బ్యాచ్ ఒకటి బాలీవుడ్ లో ఇప్పటికీ ఉంది అంటూ ఆమె తెలిపింది. మొత్తానికైతే బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ స్పష్టంగా తెలియజేసింది రవీనా.

రవీనా టాండన్ సినిమాలు..

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ,తెలుగులో బాలయ్య సరసన బంగారు బుల్లోడు అనే సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె.. తన అద్భుతమైన నటనతో అక్కడ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఇటీవలే పద్మశ్రీ అవార్డును కూడా దక్కించుకున్న ఈమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రవీనా టాండన్ కూతురు. ఇక ఇప్పుడు భారీ పాపులారిటీ సొంతం చేసుకొని స్టార్ స్టేటస్ ను అందుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు