Ravi Babu on Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌ను నమ్మి చాలా సార్లు వెధవను అయ్యా… డైరెక్టర్ సంచనల కామెంట్స్

Ravi Babu on Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలుస్తారు అనే విషయంపై జనాల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు, డైరెక్టర్ రవిబాబు ఏపీ రాజకీయాలపై జోస్యం చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయం చెప్పడంతో పాటు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేయడం హార్ట్ టాపిక్ గా మారింది. ఇంతకీ రవిబాబు పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నారు? అనే వివరాల్లోకి వెళ్తే…

నమ్మి వెధవనయ్యా..

తాజాగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో రవిబాబుకు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఎందుకు సపోర్ట్ చేయలేదు అనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ చాలా విషయాలను చూసి నిజమని నమ్మి నేను వెధవనయ్యాను. మీరు అలా అవ్వకుండా ఉంటే బెటర్ అంటూ ఘాటుగా స్పందించాడు. అయితే నిజానికి ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను మాత్రమే రిలీజ్ చేశారు. మరి ఆయన నిజంగానే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారా? లేదంటే ఇంకేదైనా అసలు మ్యాటర్ ఉందా? అనే విషయం ఆ వీడియో పూర్తిగా రిలీజ్ అయితేనే తెలుస్తుంది.

ఏపీ ఎన్నికలపై రవిబాబు జోస్యం

ఈసారి ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలవచ్చు అనే విషయాలపై స్పందిస్తూ టిడిపి నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందని నమ్మకంగా రవిబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు తన్నుకుంటూ వచ్చి సీఎం అవుతారని బల్ల గుద్ది చెప్తూనే మీకు ఏమైనా డౌటా అంటూ యాంకర్ ని ప్రశ్నించారు. అంతేకాదు టిడిపి కూటమికి 150 సీట్లకు ఏమాత్రం తగ్గవంటూ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అంటే తనకి ఇష్టమని, ఈ ఏజ్ లో కూడా 16 నుంచి 18 గంటలు పని చేస్తారు అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.

- Advertisement -

Chandrababu's Troubles Will Not Stay Longer: Ravi Babu! | Ravi Babu on  Chandrababu Troubles

రేవ్ పార్టీ ప్రస్తావన

ఇక ఇటీవల బెంగుళూరు రేవ్ పార్టీ ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా విన్పించాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో రేవ్ పార్టీలో పాల్గొన్నారా ? అని రవి బాబును ప్రశ్నించారు. కానీ ఆయన మాత్రం నన్ను ఇరికించాలి అనుకుంటున్నారా అంటూ తెలివిగా సమాధానం దాటవేశారు.

టిడిపిలో రవిబాబు

కాగా రవిబాబు గతంలో టిడిపి పార్టీలో చురుగ్గా ఉన్నారు. 2014లో ఆయన తెలుగు దేశం పార్టీ తరఫున పని చేశారు. అందుకే తాజా ఇంటర్వ్యూలో ఆయన టిడిపి అంటే ఉన్న అభిమానంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ప్రస్తుతానికి రవిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జూన్ 4వ తేదీన 2024 ఏపీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈసారి అధికార పీటాన్ని దక్కించుకునేది ఎవరు? అనే విషయం తెలియాలంటే మరో మూడు రోజుల పాటు వెయిట్ చేయక తప్పదు. సామాన్య జనాలతో పాటు సినీ, రాజకీయ వర్గాలు కూడా 2024 ఎలెక్షన్ రిజల్ట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుండడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు