Dhamaka : డబుల్ ఇంపాక్ట్ తో వసూళ్లు..

క్రాక్ సినిమా తర్వాత పెద్ద హిట్ లేక సతమతమవుతున్నాడు రవితేజ. ఎలాంటి కథలతో సినిమాలు చేసినా రవితేజకు సరైనా బూస్ట్ అందడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రవితేజకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఒకటి కావాలి. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’ తోనే రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించారు. పెళ్లి సందD భామ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 23న థియేటర్స్ లో విడుదల అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 40.37% ఆక్యుపెన్సితో థియేటర్లు జనాలతో కళకళలాడుతున్నాయి. రవితేజ మాస్ పర్ఫామెన్స్ కు శ్రీ లీల మాస్ డ్యాన్స్, గ్లామర్ తోడవడంతో ఈ చిత్రం అన్ని సెంటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను అలరించగా, థియేటర్లలో ఆడియన్స్ ను కూడా ఉర్రుతలూగిస్తున్నాయి.

ఇక ఇది ఇలా ఉండగా, చిత్ర బృందం తొలిరోజు కలెక్షన్స్ కు సంబంధించిన పోస్టర్ ని కూడా తాజాగా రిలీజ్ చేసింది. దీని ప్రకారం మాస్ మహరాజా రవితేజ ధమాకా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే రూ. 10 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ నంబర్ ఇంకా పెరిగేలా కనిపిస్తుంది. ఈ వారం రిలీజ్ అయిన లాఠీ, 18 పేజెస్, కనెక్ట్ సినిమాల కంటే ధమాకాకే ప్రేక్షకులు ఓటు వేసే ఛాన్సులు గట్టిగా కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు