Ravi Teja : 50 కోట్ల క్లబ్ లో ధమాకా

మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. ఈ మాస్ మూవీని త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించారు. పెళ్లి సందD తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భామ శ్రీ లీల. తన రెండో సినిమాతోనే రవి తేజ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 23న థియేటర్స్ లో విడుదల అయింది. రవితేజ మాస్ పర్ఫామెన్స్ కు శ్రీ లీల గ్లామర్ తోడవడంతో ఈ చిత్రం బి సెంటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శ్రీ లీల డాన్స్ తో థియేటర్స్ లో ఫ్యాన్స్ తో స్టెప్పులు వేయిస్తుంది. అయితే, తాజాగా ‘ధమాకా’ సినిమా 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. విడుదలైన ఐదు రోజుల్లో ఈ సినిమా 49 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది.

ఈరోజు కలెక్షన్స్ యాడ్ చేస్తే, 50 కోట్ల కంటే ఎక్కువ ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ‘ధమాకా’ తొలిరోజు 10 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ డల్ అవుతాయి. ఆదివారం రాబట్టిన వస్తువులలో సోమవారం సగం వస్తే గొప్ప అని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. కానీ, ‘ధమాకా’ అలా కాదు, నాలుగో రోజు కూడా దుమ్ము లేపింది. మొదటి మూడు రోజుల్లో 32 కోట్లకు పైగా కలెక్ట్ చేసే ‘ధమాకా’, నాలుగో రోజు 42 ప్లస్ కోర్స్ కలెక్ట్ చేసింది. చాలా కాలంగా ఫ్లోప్స్ ను పేస్ చేస్తున్న రవితేజకు ధమాకా మంచి హిట్ కావడంతో కమర్షియల్ సక్సెస్ ను అందుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు