Ravi Teja Fan : థియేటర్స్ నుంచి కన్నీళ్లతో బయటికి వస్తున్నాం… రవితేజకి ఫ్యాన్ ఎమోషనల్ లెటర్

Ravi Teja Fan : చాలామంది హీరోలు అభిమానుల్ని ఉద్దేశిస్తూ ప్రేక్షక దేవుళ్ళు అంటారు. ఈ ప్రేక్షక దేవుళ్ళ కోసం ఈ హీరోలు ఏం చేస్తున్నారు.? అసలు ప్రేక్షకులు ఏమి కోరుకుంటారు.? తమ అభిమాన హీరో నుంచి ఒక మంచి సినిమాను మాత్రమే కోరుకుంటారు. అటువంటి మంచి సినిమాలను హీరోలు ఇస్తున్నారా అంటే లేదని చెప్పాలి. ఇక్కడ కేవలం ఒక హీరో మాత్రమే కాదు చాలామంది అలానే చేస్తున్నారు. డజన్లకొద్దీ సినిమాలు త్వర త్వరగా చేయడం ముఖ్యం కాదు ఒక క్వాలిటీ ఫిలిం చేయటం చాలా ముఖ్యం. ఈ విషయంలో నవీన్ పోలిశెట్టి లాంటి హీరోను ఉదాహరణగా చెప్పొచ్చు.

బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో రవితేజకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అందుకే గోపీచంద్ మలినేని నేను ఎక్కడ నిలుచుంటే అదే నా బ్యాగ్రౌండ్ అని ఒక డైలాగ్ రాస్తాడు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో రవితేజ చేస్తున్న సినిమాలు అభిమానులను తీవ్రంగా నిరాశకు గురి చేస్తున్నాయి. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలను చేసిన రవితేజ ఇప్పుడేంటి ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు అని అనిపిస్తుంది.

బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు

అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి, తరువాత నటుడుగా కొన్ని సినిమాలు చేసి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి(Amma Nanna O Tamil Ammai), ఇడియట్(idiot), ఖడ్గం, కృష్ణ(Krishna), నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, భద్ర ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన సినిమాలు రవితేజ కెరియర్ లో ఉన్నాయి. అయితే 2011 లో వచ్చిన మిరపకాయ్ సినిమాలో రవితేజ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉంటుంది. మళ్లీ అటువంటి రవితేజను మిస్టర్ బచ్చన్ సినిమాతో బయటికి తీస్తాడు అని హరీష్ శంకర్ పైన చాలా మంది నమ్మకాలు పెట్టుకున్నారు. కానీ హరీష్ శంకర్ కూడా రవితేజ అభిమానులకు హిట్ ఇవ్వలేకపోయాడు.

- Advertisement -

Ravi Teja

వరుస డిజాస్టర్లు

అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం ఉంది కాబట్టి చాలామంది కొత్త దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించాడు రవితేజ. అయితే ఇక ప్రస్తుత కాలంలో రవితేజ చేసిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లు అయిపోతున్నాయి. రవితేజ కి ఎటువంటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దానిని మినిమం కూడా కాపాడలేకపోతున్నాడు మాస్ మహారాజ్. క్వాలిటీ లేకుండా క్వాంటిటీ కోసం సినిమాలు చేస్తున్నాడు. రవితేజ ఒక మంచి సినిమా చేస్తే ఖచ్చితంగా బ్రహ్మరథం పట్టి అద్భుతమైన కలెక్షన్స్ను ఇవ్వడానికి ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అభిమాని ఆవేదన

ఇక రవితేజ అభిమానులు ఎంత ఆవేదనలో ఉన్నారో ఒక అభిమాని లెటర్ చదివితే అర్థమవుతుంది. ప్రియమైన రవితేజ అన్నయ్యకి ఇది ప్రేమతో రాస్తున్న లేఖ మాత్రం కాదు. ఎంతో బాధని గుండెల్లొ దిగమంగుకుని రాస్తున్న లేఖ. అన్నయ్య, నాకు చిన్నప్పటి నుండి నీ సినిమాలు తప్ప నాకు ఇంకో ప్రపంచం తెలియదు. అందరూ ఆడుకునే వయస్సులో ఆడుకున్నారు. చదువుకునే వయస్సులో చదువుకున్నారు. ఎంజాయ్ చేసే వయస్సులో ఎంజాయ్ చేసారు. కాని నేను మాత్రం మీ సినిమా, మీ ఆలోచనలు. మిమ్మల్ని తలుచుకుంటూ, నిన్ను ప్రేమిస్తూ ఉండిపోయాను. మీకు సినిమా తప్ప ఇంకోటి ఏమి తెలేదు. మాకు నువ్వు తప్ప ఇంకోటి తెలియదు. రవితేజ అన్న.

2011 మిరపకాయ్ సినిమా తర్వాత నుండి క్రాక్ సినిమాలో మాత్రమే రవితేజ కనిపించారు. ఈ మధ్యలో వచ్చిన సినిమాలు హిట్ సినిమాలు అయినా నీ స్థాయి సినిమాలైతే కాదు. అర్ధం చేసుకుంటావని చెప్తున్నా అన్నా. నువ్వు మాకు దగ్గరగా ఉంటే నిన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చి మా బాధ చెప్పుకోవాలని ఉంది అన్నా. దయచేసి మంచి కథలను ఎంపిక చేసుకో. రవితేజ(Raviteja) అభిమానులందరూ తలెత్తుకుని తిరిగేలా హిట్లను ప్రసాదించు. అన్న దండం పెడతా అన్నా! థియేటర్ నుండి కన్నీళ్లతో బయటికి వస్తున్నాము. సినిమా సినిమాకి కన్నళ్లు ఎక్కువ అవుతున్నాయే కానీ తగ్గటం లేదు. సంతోషంగా కాలర్ ఎగరేసుకుని బయటికి వచ్చిన రోజులు ఈ మధ్య కాలంలో ఏ ఒక్క సినిమాలో కూడా రాలేదు. అలాంటి రోజులు కోసం ఎదురుచూస్తున్నాం

రవన్న.

ఇట్లు, మమ్మల్ని ప్రేమించే అభిమానులం.

అంటూ ఒక లేఖను రాశాడు ఒక అభిమాని, ఇది దాదాపు రవితేజ అభిమానుల అందరి మాట అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు