Ravi Teja : ఎక్కువ చేశాడు అంటూ ఫైర్… హరీష్ శంకర్‌పై కోపగించిన రవితేజ.

Ravi Teja : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక దర్శకుడుగా పేరు సాధించటం అంటే మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో సంవత్సరానికి 100 సినిమాలు రిలీజ్ అయితే కేవలం దానిలో రెండు మూడు సినిమాలు మాత్రమే సూపర్ హిట్ అవుతాయి. రిమైనింగ్ సినిమాలన్నీ యావరేజ్ గాను డిజాస్టర్ గానూ ఉండిపోతాయి. ఇక ఇండస్ట్రీలో ఒక కొత్త డైరెక్టర్ వచ్చి నిలబడాలి అంటే అది మామూలు విషయం కాదు. ఎంతో తాపత్రయపడి అద్భుతంగా కథను సిద్ధం చేసి జాగ్రత్తగా షూటింగ్ ఫినిష్ చేసి రిలీజ్ చేస్తే తప్ప ఒక ప్రాపర్ హిట్ సాధించలేము. ఇన్ని చేసినా కూడా కొన్నిసార్లు సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ లేదు. ఇండస్ట్రీలో చాలా సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి రవితేజ జ్యోతిక నటించడం షాక్ అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా హరీష్ కి షాక్ ఇచ్చింది.

ఆ తర్వాత మళ్లీ రవితేజ మిరపకాయ్ అనే సినిమాతో మరొకసారి అవకాశాన్ని ఇచ్చాడు. ఈసారి మాత్రం హరీష్ శంకర్ అవకాశాన్ని వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ను అందించాడు. ఈ సినిమాతోనే దర్శకుడుగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ సినిమాను ఎలా చూడాలనుకుంటారో అలా చూపించి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇక్కడితో హరీష్ శంకర్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలతో కూడా సినిమాలు చేశాడు.

Ravi Teja

- Advertisement -

ప్రొడ్యూసర్స్ కి షాక్

అయితే హరీష్ శంకర్ కెరియర్లో గబ్బర్ సింగ్ మించిన హిట్ ఒకటి కూడా లేదు. మళ్లీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే గాని రాదు అని కొంతమంది అభిప్రాయం. ఇకపోతే ప్రస్తుతం రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రొడ్యూసర్స్ కి షాక్ ఇస్తున్నాడు హరీష్ శంకర్ అని తెలుస్తుంది. ముందుగా ఈ సినిమా బడ్జెట్ ఆర్టిస్టులు రెమ్యూనరేషన్ తో కలిపి 70 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.

ఇప్పుడు ఆ 70 కోట్ల రెమ్యూనరేషన్ కాస్త దాటి 90 కోట్లకు వెళ్ళిపోయింది అని సమాచారం. 90 కోట్లు అయిపోయినా కూడా ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. రవితేజ కెరియర్ లో 100 కోట్లు సినిమాలు రావడం రెర్ థింగ్. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ధమాకా సినిమా 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తే గాని వర్క్ అవుట్ అవ్వదు. లేదంటే నిర్మాతలకు మాత్రమే కాకుండా రవితేజ కూడా ఒక చిన్నపాటి షాక్ అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు