Ravi Teja: రవితేజ కోసం సెట్ రెడీ , కొత్త డైరెక్టర్ పర్ఫెక్ట్ ప్లానింగ్

Ravi Teja: అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటుడుగా కొన్ని సినిమాలు చేసి కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సింధూరం సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు రవితేజ. అయితే రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న టైంలోనే దర్శకుడు పూరీ జగన్నాద్ రవితేజతో చాలాసార్లు నేను నిన్ను మంచి హీరోని చేస్తాను అనేవాడు. అయితే రవితేజ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ పూరి జగన్నాథ్ చెప్పినట్లుగానే రవితేజని స్టార్ హీరోయిన్ చేసేసాడు. ప్రస్తుతం రవితేజ సినిమా అంటే చాలా అంచనాలు ఉన్నాయి ప్రేక్షకులలో.

రవితేజ కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి.కానీ వాటిని మించి పూరి జగన్నాథ్ చేసిన సినిమాలు వేరే లెవెల్లో ఉంటాయని చెప్పొచ్చు. ఇకపోతే రీసెంట్ గా ధమాకా సినిమాతో అద్భుతమైన ఘన విజయాన్ని అందుకున్నాడు రవితేజ. ఇకపోతే రవితేజ కి ఒక దర్శకుడు యొక్క ప్రతిభ తెలుసు కాబట్టి చాలామంది కొత్త దర్శకులను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు రవితేజ పరిచయం చేసిన దర్శకులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉన్నారు. బాబి, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని చాలామంది దర్శకత్వం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేశాడు రవితేజ. ఇప్పుడు కూడా భాను భోగవరపు అనే మరో దర్శకుని పరిచయం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

RT75

- Advertisement -

భాను భోగవరపు శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమాకి రచయితగా పనిచేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించి దాదాపు 50 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ రచయిత ఇప్పుడు రవితేజను డైరెక్షన్ చేస్తున్నాడు. రవితేజ తన కెరీర్ లో నటిస్తున్న 75వ సినిమాను చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు భాను. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక రైల్వే స్టేషన్ సెట్ ను వేసినట్లు సమాచారం వినిపిస్తుంది. రవితేజ లేకుండా ఉండే సీన్స్ ను కొన్ని ఆల్రెడీ షూట్ చేసేసారట. ఇకపోతే ప్రస్తుతం రవితేజ హరిష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తవుగానే ఈ సినిమా సెట్ లోకి అడుగుపెట్టనున్నాడు రవితేజ. ఇకపోతే ఈ సినిమా పిరియాడికల్ డ్రామా అని వస్తున్న వార్తలన్నీ కూడా నిజం కాదని ఇదొక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని విశ్వసినీయ వర్గాల సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు