Ravi Teja: ఎటుచూసి డైలాగ్ చెప్తున్నావ్ అన్న, ఆ ఒక్క సినిమా చెయ్యకుండా ఉండాల్సింది

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఏమీ కాదు. చాలామంది హీరోల అభిమానులు కూడా రవితేజను విపరీతంగా ఇష్టపడతారు. ఇకపోతే రవితేజ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. మంచి మంచి క్యారెక్టర్స్ ను రవితేజకు డిజైన్ చేశారు చాలామంది దర్శకులు. ఒక పూరి జగన్నాథ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ సూపర్ హిట్ సినిమాలు అన్నీ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినవే. ఇకపోతే ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రవితేజ.

సినిమాకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. హరీష్ శంకర్ ఒక రీమేక్ సినిమా చేసినా కూడా తనదైన మార్పులు చేర్పులు చేసి ఒక ఫ్రెష్ ఫీల్ ను క్రియేట్ చేస్తాడు. ఇది గబ్బర్ సింగ్ సినిమా నుంచి మొదలైంది. చాలామంది రైట్స్ తీసుకుని కూడా వేస్ట్ కేవలం ఆ పాయింట్ మాత్రమే తీసుకున్నాడు అంటూ చెబుతూ ఉంటారు. ఇక రీమేక్ సినిమాలు గురించి హరీష్ శంకర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇక మిస్టర్ బచ్చన్ టీజర్ విషయానికొస్తే టీజర్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే కొంతమంది టీజర్ గురించి కంప్లైంట్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు అని చెప్పాలి.

Raja the Great

- Advertisement -

రవితేజ కెరియర్ లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించుకుంది. ఈ సినిమాలో బ్లైండ్ పాత్రలో కనిపిస్తాడు రవితేజ. అయితే ఆ పాత్రకు చాలామంది ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. ఎంతలా కనెక్ట్ అయిపోయారు అంటే రవితేజ ఇప్పుడు ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాలో చేసినట్టు చేస్తున్నాడు అనేంతల కనెక్ట్ అయిపోయారు. ఇక కొన్ని రవితేజ సినిమాలకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, సినిమాలు చూసినప్పుడు రాజా ది గ్రేట్ సినిమా రీసెంట్ టైమ్స్ లో గుర్తొస్తుంది. కొంతమంది అయితే దారుణంగా ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది అన్న అసలు డైలాగ్ ఎటువైపు చూసి చెప్తున్నావ్ అంటూ ట్రోల్స్ కూడా మొదలుపెట్టారు. ఇక దీనిని మాస్ మహారాజా ఎలా అధిగమిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు