Ravi Teja: రజినీకాంత్ తో రవితేజ పోటీ.. టెన్షన్ లో ఫ్యాన్స్ ..

Ravi Teja : టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఆ సినిమాకు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. హరీష్ శంకర్-రవితేజ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎటువంటి డైలాగులు లేకుండా యాక్షన్ రవితేజ అదరగొట్టారు.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది..

ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు డేట్ ను లాక్ చేసుకున్నట్లు ఓ వార్తా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 10 న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ తేదీన ఎన్టీఆర్ దేవర మూవీని విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా ప్రీ పోన్ అవ్వడం తో ఆ డేట్ న మిస్టర్ బచ్చన్ సినిమాను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అయితే అదే రోజున సూపర్ స్టార్ రజిని కాంత్ సినిమా కూడా విడుదల కాబోతుంది..

Ravi Teja's competition with Rajinikanth.. Fans in tension..
Ravi Teja’s competition with Rajinikanth.. Fans in tension..

రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’ డబ్బింగ్ వెర్షన్ అదే రోజు ఇక్కడ కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో రవితేజ మరియు రజినీ పోటీని ఫ్యాన్స్ చూడబోతున్నారు.. మరి ఈ సినిమాను ఎప్పుడు విడుదల చెయ్యబోతున్నారు అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో క్యాస్టింగ్ అదిరిపోయింది. జగపతి బాబు విలన్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించబోతుంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు