Ravibabu: తన తండ్రి చలపతిరావు కామెంట్స్ పై స్పందించిన రవిబాబు

Ravibabu: అల్లరి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రవిబాబు. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కాకుండా చిన్న చిన్న హీరోలతో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీస్తూ తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. అయితే చాలామంది దర్శకులలో మూస దారుణంలో సినిమాలు తీయకుండా తనకంటూ ఒక పంథాను ఏర్పరచుకున్నాడు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించాడు రవిబాబు. తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో చాలామందిని ఆశ్చర్యపరిచాడు. థ్రిల్లర్ జోనర్ సినిమాలను కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. కేవలం దర్శకుడుగానే కాకుండా నటుడుగా కూడా తనను తాను నిరూపించుకున్నాడు. చాలా సినిమాల్లో విలన్ పాత్రలో కనిపించి తెలుగు ఆడియన్స్ ను మెప్పించాడు.

Ravi Babu

రవిబాబు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవిబాబు తండ్రి చలపతిరావు పెద్ద నటులు. ఎన్నో సినిమాల్లో తనదైన పాత్రలో కనిపించి తెలుగు ప్రాక్షకులను మెప్పిస్తూ వచ్చారు. అయితే ఎన్ని గుర్తింపు ఉన్న పాత్రలు చేసినా కూడా కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు చేసిన వ్యాఖ్యలను బట్టి మనం విలువ దిగజారి పోతుందని చెప్పొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చలపతిరావు అని చాలామందికి తెలిసిందే. రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆడవాళ్ళ గురించి అనుచితమైన వ్యాఖ్యలను చేశారు చలపతిరావు. అక్కడితో చాలామందికి చలపతిరావు టార్గెట్ మారారు.

- Advertisement -

ఇకపోతే చలపతిరావు చేసిన ఆ వ్యాఖ్యలపై రవిబాబు ఎప్పుడు స్పందించలేదు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్యలపై స్పందించాడు రవిబాబు. “నేనెప్పుడూ మా నాన్న చేసిన వ్యాఖ్యల గురించి నేను స్పందించలేదు అవి తప్పు అని ఆయనతో చెప్పాను పబ్లిక్ గా ఆయన క్షమాపణలు చెప్పడం కూడా సరైన పద్ధతి అని చెప్పాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక చలపతిరావు కూడా పబ్లిక్ గా చేసిన కామెంట్స్ కు పబ్లిక్ గాని క్షమాపణలు చెప్పారు” అంటూ చెప్పుకొచ్చారు రవిబాబు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు