Raviteja: డైరెక్టర్ ట్వీట్.. నాటు రిప్లై ఇచ్చిన మాస్ మహారాజా..!

Raviteja.. మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు సినిమాపై హైప్ పెంచిన విషయం తెలిసిందే. ఇక హిందీలో అజయ్ దేవగన్ చేసిన రైడ్ సినిమాకి.. ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్లో భాగంగా అందుకు సంబంధించిన లొకేషన్స్ ని కూడా షేర్ చేస్తూ వస్తున్నారు హరీష్ శంకర్.. ఇప్పుడు తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ లొకేషన్స్ నుంచి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అందరిలో సినిమాపై ఆసక్తి చేస్తున్నారు.

ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది..అన్నయ్యకు తప్పా..

Raviteja: Director's tweet.. Mass Maharaja who gave a reply..!
Raviteja: Director’s tweet.. Mass Maharaja who gave a reply..!

ఈ క్రమంలోనే తాజాగా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సాంగ్ షూటింగ్లో రవితేజ ఫోటో తీసి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.. అంతేకాదు ఫోటో కింద క్యాప్షన్ కూడా ఇచ్చారు..” ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది.. కానీ అన్నయ్యకు తప్ప”.. కాశ్మీర్ వ్యాలీలో షూటింగ్ జరుగుతోంది.. త్వరలోనే హైదరాబాద్లో దిగుతాము”.. అంటూ మిస్టర్ బచ్చన్ సినిమా అప్డేట్ ఇస్తూ పోస్ట్ చేశాడు హరీష్ శంకర్. https://twitter.com/harish2you/status/1804735233163751646

నీ దిష్టే తగిలేలా ఉంది..

అయితే హరీష్ శంకర్ కి రవితేజ నాటు రిప్లై ఇచ్చాడు… “ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది”.. అంటూ రిప్లై ఇచ్చాడు మాస్ మహారాజా రవితేజ.. ఇక రవితేజ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. రవితేజ ఇలా సరదాగా రిప్లై ఇవ్వడంతో మాస్ మహారాజా హ్యూమర్ సెన్స్ మీద సరదా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మిస్టర్ బచ్చన్ సినిమా దసరా సమయానికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మొత్తానికి అయితే మిస్టర్ బచ్చన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆత్రుత కనబరుస్తున్నారు.

- Advertisement -

హీరో గానే కాదు నిర్మాతగా కూడా..

ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా సత్తా చాటుతూ ఇప్పుడు నిర్మాతగా కూడా అడుగులు వేస్తున్నారు. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే పనిలో పడ్డారు. ఇక అందులో భాగంగానే 2022లో మట్టి కుస్తీ అనే సినిమాను తమిళ్లో నిర్మించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఇక 2023లో రావణాసురుడు, చాంగురే బంగారు రాజా, సుందరం మాస్టర్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

సోదరుడు కూడా నటుడే..

ఇక రవితేజ తమ్ముడు భరత్ కూడా నటుడుగా ఇండస్ట్రీలో చేశారు. ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు భరత్. ఒక్కడే , అతనే ఒక సైన్యం, జంపు జిలాని, పెదబాబు , దోచేయ్ లాంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసిన భరత్ (52).. 2017 జూలై 24న రాత్రి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద శంషాబాద్ మండలం కొత్వాల్ గూడా దగ్గర తన కారులో అతివేగంగా ప్రయాణిస్తున్న ఈయన.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఇక తమ్ముడి మరణం రవితేజను చాలా రోజులు మనిషిని చేయలేకపోయింది. ప్రస్తుతం బాధలన్నింటినీ దిగమింగుకొని.. వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారారు రవితేజ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు