MrBachchan PreRelease Event : హరీష్ శంకర్ కి కొత్త ట్యాగ్ ఇచ్చిన మాస్ మహారాజ్..

MrBachchan PreRelease Event : మాస్ మహారాజ రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో “మిస్టర్ బచ్చన్” అనే యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలు లో గ్రాండ్ గా జరిగింది. చిత్ర యూనిట్ మొత్తం ఈ ఈవెంట్ లో సందడి చేయగా, మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ స్పీచ్ లతో పాటు, భాగ్య శ్రీ బోర్సే అదిరిపోయే స్టెప్పులు కూడా హైలెట్ గా నిలిచాయి. ఇక మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ సినిమా గురించి, హరీష్ శంకర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.

RaviTeja gave a new tag to director Harish Shankar

స్పీచ్ తో అదరగొట్టిన మిస్టర్ బచ్చన్…

ఇక ఈవెంట్ లో మాస్ మహారాజ్ రవితేజ మాట్లాడుతూ… మా కెమెరామెన్ అయాంక బోస్ మా అందరినీ ఎంతో చక్కగా చూపించాడు, అలాగే భాను మంచి స్టెప్పులు కంపోజ్ చేశాడు. ఇంకా ముందుముందు ఎన్నో పాటలు చేయాలి, భాస్కర భట్ల నాకు ఎన్నో పాటలు రాశారు, ఇక కాసర్ల శ్యామ్ తో ఈ మధ్యే జర్నీ స్టార్ట్ అయిందన్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మిక్కీ జే మేయర్ హీరో ఆఫ్ ధి ఈవినింగ్ అని రవితేజ చెప్పారు. మిక్కీ నుంచి ఇలాంటి పాటలు వస్తాయని తాను అనుకోలేదని, ఇది మిక్కీ ఇచ్చిన పాటలా అని షాక్ అయ్యానన్నారు. ఇక భాగ్యశ్రీ అయితే ఊపు ఊపేస్తోందని అన్నాడు. ఇక హరీష్ శంకర్ గురించి స్పెషల్ గా చెప్పుకొచ్చాడు రవితేజ.

- Advertisement -

హరీష్ కి కొత్త ట్యాగ్ ఇచ్చిన రవితేజ..

ఇక చివరగా హరీష్ శంకర్ గురించి రవితేజ మాట్లాడుతూ… మా ఇద్దరి రిలేషన్ గురించి నా కన్నా హరీష్ శంకర్ ఎక్కువ బాగా చెబుతాడు, మా కాంబోలో షాక్ ఫస్ట్ డిజప్పాయింట్ చేసింది.. హరీష్ చాలా కష్టపడతాడు కానీ, షాక్ కాస్త నిరాశపర్చింది.. ఈ మూవీతో మా కాంబోలో హ్యాట్రిక్ స్టార్ట్ కావాలి, మళ్లీ ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని అన్నాడు. ఇక స్పీచ్ ముగిస్తుంటే… యాంకర్ సుమ వచ్చి హరీష్ శంకర్ కి కొత్త ట్యాగ్ ఇవ్వమని అడుగుతుంది. ఇక రవితేజ హరీష్ ఎప్పుడూ ఎనర్జిటిక్ గా, యాక్టీవ్ గా పనిచేస్తాడు కాబట్టి, “ది మోస్ట్ ఎనర్జిటిక్ స్టార్ డైరెక్టర్” అని టైటిల్ ఇచ్చేసాడు రవితేజ. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా ఆగష్టు 14 న సాయంత్రం 7 గంటల నుండే ప్రీమియర్స్ మొదలవుతున్నాయని రవితేజ చెప్పుకొచ్చాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు