Raviteja: హ్యాట్సాఫ్ టు మాస్ మహారాజా, నెక్ పెయిన్ తో కూడా వర్కింగ్

Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని పాత్రలను చేశాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సింధూరం సినిమాలో రవితేజ పాత్ర చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ రవితేజను స్టార్ హీరోని చేశాడు. రవితేజ కెరీర్ కి మంచి అదిరిపోయే హిట్ సినిమాలను అందించాడు. ఇప్పటికీ రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా అంటేనే వేరే లెవెల్ లో ఉంటుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

రవితేజ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది కొత్త దర్శకులను పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే. రవితేజ పరిచయం చేసిన ఎంతోమంది దర్శకులు నేడు హై పొజిషన్ లో ఉన్నారు. రవితేజ పరిచయం చేసిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. షాక్ అనే సినిమాతో హరీష్ శంకర్ ను దర్శకుడుగా పరిచయం చేశాడు రవితేజ. అయితే దర్శకుడుగా ఈ సినిమా షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మిరపకాయ్ అనే సినిమాను చేశాడు రవితేజ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక్కడితో దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెటిలైపోయాడు హరీష్ శంకర్.

Ravi Teja - Harish Shankar

- Advertisement -

ఇకపోతే గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నాడు హరీష్. హరీష్ కి కొంతమంది యాటిట్యూడ్ అని అంటూ ఉంటారు. కానీ గ్రాటిట్యూడ్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. హరీష్ తన కెరీర్ గురించి తన సక్సెస్ గురించి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా తనకు ఆ లైఫ్ రవితేజ వలన వచ్చింది అని చెబుతూ ఉంటాడు. అలానే రవితేజను అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు హరీష్ శంకర్. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుపుకుంటుంది. అయితే రవితేజ తీవ్రమైన నెక్ పెయిన్ తో కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇదే విషయాన్ని స్వయంగా హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.హ్యాట్సాఫ్ టు మాస్ మహారాజా థాంక్యూ అన్నయ్య యు ఇన్స్పైర్స్ ఎవిరిడే అంటూ రాసుకోచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు