Raviteja : రవితేజ కొత్త స్టిల్ అదిరిపోయింది భయ్యా..

Raviteja look : టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హిట్ సినిమాలతో పని లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఈ మధ్య కాలంలో సరైన హిట్ సినిమా హీరో ఖాతాలో పడలేదు.. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న మాస్ హీరో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాయి..

raviteja latest look viral in social media
raviteja latest look viral in social media

రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి షో రీల్ అని ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసారు.. ఇందులో హీరో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటాడు. ఓ పెద్ద రాజకీయ నాయకుడి ఇంటికి రైడ్ కి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ షో రీల్ లో డైలాగ్స్ ఏం లేకుండా కేవలం యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేసాడు రవితేజ. 1990 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. యాక్షన్ సీన్స్ తో పాటుగా లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది..

raviteja latest look viral in social media
raviteja latest look viral in social media

ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది, జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఇదిలా ఉండగా తాజాగా రవితేజ లుక్ ఒకటి విడుదల చేసారు.. మిస్టర్ బచ్చన్ లుక్ అంటూ ఒక ఫోటో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.. ఆ ఫొటోలో రవితేజ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఇక మిస్టర్ బచ్చన్ నుంచి త్వరలో లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు