Raviteja: యశోద హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న మాస్ మహారాజా, ఆరువారాలు బెడ్ రెస్ట్

Raviteja: అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన రవితేజ ముందుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తర్వాత నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఇకపోతే రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు రవితేజ. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన డిజాస్టర్ చవి చూసింది. ఇకపోతే రవితేజ ఇప్పటివరకు తన కెరీర్ లో 74 సినిమాలను పూర్తి చేశాడు.

రవితేజ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రస్తుతం తన 75వ సినిమాను చేస్తున్నాడు. ఈ షూటింగ్లో రవితేజకు కొద్దిపాటి గాయం అయింది. అయితే ఆ గాయంతోనే దాదాపు ఆ షూటింగ్లో పాల్గొన్నాడు రవితేజ. ఈ తరుణంలో ఆ గాయం కాస్త సీరియస్ అయింది. కుడి చేతికి గాయం ఎక్కువగా కావడంతో యశోద హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేశారు. ఇక ఆరు వారాలపాటు రవితేజ విశ్రాంతి తీసుకోవాలని యశోద హాస్పిటల్ యాజమాన్యం రవితేజకు చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాకి సంబంధించి రవితేజ లేని సీన్స్ ను షూట్ చేసే అవకాశం ఉంది. కానీ రవితేజతో షూటింగ్ చేయాలంటే చిత్ర యూనిట్ నెల రోజుల వరకు వేచి చూడకు తప్పదు.

RT75

- Advertisement -

 

రీసెంట్ టైమ్స్ లో రవితేజ ఒక ప్రాపర్ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ధమాకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు రవితేజ కెరీర్ లో ప్రాపర్ హిట్ సినిమా పడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈగల్, అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలు కూడా నిరాశపరిచాయి. ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమా మీద అందరికీ మంచినాలు ఉన్నాయి. ఈ అంచనాలను ఏ మేరకు ఈ సినిమా అందుకుంటుందో తెలియాలంటే కొంతవరకు వేచి చూడకు తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు