Mr.Bachchan: ‘రెప్పల్ డప్పుల్’ అంటూ మాస్ స్టెప్పులతో అదరగొట్టిన మాస్ హీరో.. లిరిక్స్ అదిరిపోయాయి..

Mr.Bachchan: టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్.. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగష్టు లో విడుదల కాబోతుంది.. ఈ క్రమంలో సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళుందుకు టీమ్ గట్టిగానే ప్రమోషన్స్ ను చేస్తుంది.. ఈ మేరకు సినిమా నుంచి వరుస అప్డేట్స్ ను విడుదల చేస్తుంది.. మొన్నటివరకు పోస్టర్స్ ను మాత్రమే రిలీజ్ చేసిన టీమ్ ఇప్పుడు స్పీడును పెంచేసింది.. ఈ సినిమాలోని వరుసగా సాంగ్ లను విడుదల చేస్తున్నారు. మొన్న రిలీజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో సాంగ్ ను టీమ్ విడుదల చేసింది..

మిస్టర్ బచ్చన్ నుంచి తాజాగా సెకండ్‌ సింగిల్‌ రెప్పల్‌ డప్పుల్‌ అనే మాస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. నిన్న విడుదలైన సాంగ్ ప్రోమో నెట్టింట ట్రెండ్ అవుతుంది.. రవితేజ, భాగ్య శ్రీ బోర్సే మధ్య వచ్చే ఈ పాట ఊరమాస్‌గా సాగుతూ రవితేజ ఎనర్జీ లెవల్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతుందని ఈ పాటలోని స్టెప్పులను చూస్తే తెలుస్తుంది. సాంగ్ లిరిక్స్ అందరిని బాగా ఆకట్టుకుంటున్నాయి.. మ్యూజిక్ మాత్రమే జనాలతో డ్యాన్స్ చేయిస్తుందని చెప్పాలి..

raviteja mr bachha second lyrical song released
raviteja mr bachha second lyrical song released

ఈ సినిమాకు ఇమిక్కీ జే మేయర్ మ్యూజిక్‌ అందిస్తుండగా.. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ తెరకెక్కిస్తున్నారు. రవితేజ బాలీవుడ్ సూపర్ స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమాని కాగా.. మాస్‌ మహారాజా మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ పెట్టడం సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాయి.. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఇక సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఈ మూవీ ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఆగష్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు