Vikramarkudu ReRelease : రవన్న ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్.. విక్రమ్ రాథోడ్ రీ ఎంట్రీ ఫిక్స్..

Vikramarkudu ReRelease : టాలీవుడ్ లో మాస్ మహారాజ్ గా అభిమానులను అలరిస్తున్న రవితేజ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే గత కొంతకాలంగా రవితేజ సరైన హిట్లు లేక ఫామ్ లో లేడన్న సంగతి తెలిసిందే. గత మూడేళ్ళలో ధమాకా తప్పా… అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఈ ఇయర్ కూడా ఈగల్ తో మళ్ళీ డిజాస్టర్ ను అందుకున్నాడు. అందుకే రవన్న అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. అయితే డల్ గా ఉన్న ఫ్యాన్స్ లో జోష్ నింపడానికి అత్తిలి సత్తిబాబుగా రవితేజ మళ్ళీ వచ్చేస్తున్నాడు. అత్తిలి సత్తిబాబు అంటే అందరికి విక్రమార్కుడు గుర్తొస్తాడు. అయితే ఇప్పుడు థియేటర్లలో మళ్ళీ జింతాత్ చేయడానికి విక్రమ్ రాథోడ్ రాబోతున్నాడు.

Raviteja Vikramarkudu Movie Re Releasing On July27

విక్రమ్ రాథోడ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్..

రవితేజ హీరోగా నటించిన ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 2006 లో వచ్చిన సినిమా ‘విక్రమార్కుడు’. విక్రమ్ రాథోడ్ గా, అత్తిలి సత్తిబాబు గా ద్విపాత్రాభినయంతో రవితేజ నట విశ్వరూపం చూపించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే విక్రమార్కుడు రిలీజ్ అయ్యాకా… తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా రీమేక్ అయింది. అన్ని భాషల్లో సినిమా హిట్ అయింది. కానీ రవితేజ ఎనర్జీని మాత్రం ఏ ఒక్క హీరో మ్యాచ్ చేయలేకపోయారు. అయితే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ నెల జులై 27న థియేటర్లలో విక్రమార్కుడు (Vikramarkudu ReRelease) సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ అనౌన్స్ మెంట్ తో రవితేజ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

- Advertisement -

మిస్టర్ బచ్చన్ రెడీ..

ఇక రవితేజ ఈ ఇయర్ ఎలాగైనా హిట్ కొట్టాలని హరీష్ శంకర్ తో హ్యాట్రిక్ సినిమాగా మిస్టర్ బచ్చన్ చేస్తున్నాడు. ఇది బాలీవుడ్ లో వచ్చిన రేస్ సినిమాకి రీమేక్ అని తెలిసిందే. ఇక మిస్టర్ బచ్చన్ నుండి ఇప్పటికే టీజర్, ఓ సాంగ్ రిలీజై మూవీపైన అంచనాలు పెంచేసాయి. ఆగష్టు 15న మిస్టర్ బచ్చన్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ లోపు విక్రమార్కుడు సినిమాతో ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి విక్రమ్ రాథోడ్ గా మళ్ళీ వస్తున్నాడు రవితేజ. అయితే సినిమా వస్తుందని ఇంకాస్త అభిమానులకు తెలిసేలా మేకర్స్ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు