Raayan: రామాయణం మహాభారతంలో ఉండేటటువంటి హై పాయింట్స్ ధనుష్ రాసాడు

Raayan: త్రీ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ధనుష్. సినిమా రిలీజ్ కంటే ముందు దాంట్లో కొలవెరిడీ అనే పాట మంచి హిట్ అయింది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే ఈ సినిమా మాత్రం ఊహించిన విజయాన్ని సాధించుకోలేదు. ఆ తర్వాత ధనుష్ చేసిన రఘువరన్ బీటెక్ సినిమా తెలుగులో మంచి హిట్ అయింది అక్కడితో ధనుష్ కి ఫ్యాన్స్ కూడా మొదలయ్యారు. ఆ తర్వాత ధనుష్ చేసిన చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ధనుష్ చేసిన ప్రతి సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి.

రీసెంట్ గా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు ధనుష్ సార్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వెంకీ అట్లూరి కెరియర్ లో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అని చెప్పొచ్చు. ధనుష్ స్ట్రైట్ గా చేసిన తెలుగు సినిమా ఇది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం శేఖర్ కమల దర్శకత్వంలో కుబేర అనే సినిమాను చేస్తున్నాడు ధనుష్. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ చేసిన పోస్టర్ సినిమా పైన మంచి అంచనాలను పెంచుతుంది.

Raayan

- Advertisement -

ధనుష్ మల్టీ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం దర్శకుడుగానే కాకుండా రచయితగాను సింగర్ గా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు అలానే దర్శకుడుగా కూడా తన టాలెంట్ ఏంటో చూపించాడు ధనుష్. ప్రస్తుతం ధనుష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా రాయన్. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి సందీప్ కిషన్ కీలకపాత్రలో కనిపించనున్నారు ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది.

ఈ సినిమా గురించి కొన్ని కీలకమైన విషయాలను దర్శకుడు నటుడు ఎస్ జె సూర్య పంచుకున్నారు. ఈ సినిమాలోని ప్రతి పాత్రకి ప్రత్యేకత ఉంటుంది. రామాయణ మహాభారతంలో ఎటువంటి హై పాయింట్స్ ఉంటాయో అలాంటి హై పాయింట్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయి అంటూ ఒక స్టేట్మెంట్ ని ఇచ్చాడు. ఎస్ జె సూర్య ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ తర్వాత సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు