Rayaan Movie first review : రాయన్ మూవీ ఫస్ట్ రివ్యూ

Rayaan Movie first review : తమిళ్ స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులు కూడా పరిచయమే. ఎందుకంటే ఒక గొప్ప సినిమా ఏ భాషలో ఉన్నా కూడా చూడటం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటినుంచో అలవాటు అయిపోయింది. సినిమాను తెలుగు ప్రేక్షకులు ప్రేమించినంతగా వేరే ఇండస్ట్రీ ప్రేక్షకులు ప్రేమించరు అనేది వాస్తవం. తెలుగు హీరోలకి ఎంత డిమాండ్ ఉంటుందో చాలామంది తమిళ్ హీరోల సినిమాలను కూడా అదే స్థాయిలో ఆదరిస్తూ వాళ్లకి మంచి ఓపెనింగ్స్ కట్టబెట్టడంలో తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందుంటారు. ఇది కేవలం మనం అనుకున్న మాటలు మాత్రమే కాదు చాలామంది స్టార్ హీరోలు సైతం ఈ మాటలను చెబుతూ ఉంటారు. అమితాబచ్చన్ లాంటి వారి తెలుగు ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలి అని చాలా సార్లు చెప్పారు.

ఇక తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ పర్సన్ ధనుష్. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన త్రీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా కంటే ముందు అనిరుద్ కంపోజ్ చేసిన కొలవరెడి అనే పాట ఒక సంచలనం గా మారింది. కొన్ని మిలియన్స్ వ్యూస్ ఆ పాటకి వచ్చాయి అక్కడితోనే సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక తర్వాత ధనుష్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ని సాధించక పోయినా కూడా. ధనుష్ మైల్ స్టోన్ ఫిల్మ్ గా వచ్చిన రఘువరన్ బీటెక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. అప్పటినుంచి ధనుష్ చేసిన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతూ వచ్చింది.

Raayan

- Advertisement -

రీసెంట్ గా ధనుష్ తెలుగులో సార్ అనే సినిమాను చేశాడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ధనుష్ తన కెరియర్లో 50వ సినిమాను రీసెంట్ గా పూర్తి చేసుకున్నాడు. ధనుష్ దర్శకత్వం వహించిన రాయన్ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాని చాలా అద్భుతంగా ధనుష్ డిజైన్ చేశాడు. సందీప్ కిషన్ కి కూడా మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రను. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకున్న కూడా ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అదిరిపోయింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు మొదలయ్యాయి. పవర్ పాండి సినిమా తర్వాత మరోసారి దర్శకుడిగా ధనుష్ ప్రూవ్ చేసుకున్నాడు అంటూ ప్రశంసలు మొదలయ్యాయి. ఈ సినిమాకి సెకండ్ హీరోగా ఏఆర్ రెహమాన్ అని చెప్పొచ్చు అని నెటిజెన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాలో అపర్ణ బాలమురళి సందీప్ కిషన్ సెల్వ రాఘవన్ వంటి ప్రముఖ నటులు కనిపిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు