Rayaan: రాయన్ సినిమా ఓటీటీ లో ఎప్పుడంటే.?

Rayaan: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో ధనుష్ ఒకరు. పేరుకు తమిళ నటుడు అయినా కూడా తెలుగులో కూడా మంచి స్టార్ డం ఉంది ధనుష్ కు. ఈరోజుల్లో ఒక్క స్టార్ హీరో ఒక సినిమా చేయడానికి దాదాపు రెండు మూడేళ్లు సమయం తీసుకుంటున్నారు. కానీ చాలామంది తమిళ్ హీరోస్ అతి త్వరగా సినిమాలు మీద సినిమాలు చేసుకుంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. రీసెంట్గా విజయ్ సేతుపతి 50 సినిమాలను పూర్తి చేసుకున్నాడు. ఇక రాయన్ సినిమాతో ధనుష్ కూడా 50 సినిమాలను పూర్తి చేసుకున్నాడు.

జులై 26న ప్రేక్షకులు ముందుకు వచ్చిన రాయన్ సినిమా మంచి కలెక్షన్స్ తో ముందుకు పోతుంది. మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడిగా నటుడిగా ఈ సినిమాతో 100% సక్సెస్ అయ్యాడు ధనుష్. ఈ సినిమాను సన్ నెట్వర్క్ సంస్థ కళానిధి మారు నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, సందీప్ కిషన్ వంటి ప్రముఖ స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తుంది. ఇకపోతే ఈ సినిమా సన్ నెట్వర్క్ ఓటీటీ లో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Rayaan

- Advertisement -

ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అంటే. ఈ సినిమా థియేటర్ రెస్పాన్స్ బట్టి ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. ఇంకో రెండు మూడు రోజుల తర్వాత వీకెండ్స్ కలెక్షన్స్ బట్టి ఈ సినిమా అసలైన రిసల్ట్ ఏంటో తెలుస్తుంది. ఏదేమైనా ధనుష్ మైల్ స్టోన్ ఫిల్మ్ గా వచ్చిన రాయన్ ఆడియన్స్ అయితే ఎంటర్టైన్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు