Anushree Tripathi : చరణ్ అంటే క్రష్ అన్న రజాకార్ భామ..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా తన క్రేజ్ ని ఫాలోయింగ్ ని పెంచుకుంటూనే ఉన్నాడు. మగధీర నుండే అమ్మాయిల్లో మంచి క్రష్ గా మారిపోయిన రామ్ చరణ్ ఆ తర్వాత ఆరెంజ్ సినిమాతో యూత్ కి మరింత చేరువయ్యాడు. ఆ తర్వాత కమర్షియల్ సినిమాలపై ద్రుష్టి పెట్టి కాస్త ఫిమేల్ ఫాలోయింగ్ కి దూరమయినట్టు అనిపించినా అదేమీ తగ్గలేదని అప్పుడప్పుడూ థియేటర్ల దగ్గర లేడీ ఫ్యాన్స్ చేసే హంగామా చూస్తేనే తెలుస్తుంది. ఇక RRR సినిమా తరువాత రామ్ చరణ్ ఒక్క పాన్ ఇండియా వైడ్ గానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తన ఫాలోయింగ్ ని క్రేజ్ ని పెంచుకుంటూనే ఉన్నాడు. ముఖ్యంగా నార్త్ లో అమ్మాయిల్లో చెర్రీ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. ఇక చాలా మంది హీరోయిన్లు కూడా చరణ్ కి పడిపోయారని తెలిసిందే. రీసెంట్ గానే ప్రేమలు హీరోయిన్ మామితా బైజు కూడా చరణ్ పై తనకున్న ఇష్టాన్ని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ చరణ్ ఫ్యాన్స్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది.

చరణ్ నా క్రష్ అంటున్న రజాకార్ నటి అనుశ్రీ..

గత కొన్నేళ్లుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోయిన్లలో చాలా మంది ఏ హీరో క్రష్ అంటే, ఏ హీరోతో వర్క్ చేయాలనీ ఉందంటే, ఎక్కువగా అందరూ ఫస్ట్ చెప్పే పేరు రామ్ చరణ్ అనే అంటున్నారు. మొన్న మామితా బైజు చరణ్ పేరు ప్రస్తావించింది. ఇక లేటెస్ట్ గా ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన హిట్ చిత్రం “రజాకార్”. ఈ సినిమాలో నిజాం వైఫ్ గా నటించిన నటి అనుశ్రీ త్రిపాఠి రామ్ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకి అభిమాన హీరోస్ లో టాలీవుడ్ నుండి రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని మెయిన్ గా రామ్ చరణ్ గారిలో ఇంటెన్స్ ఎమోషన్స్ అంటే బాగా ఇష్టమని చెప్పుకొచ్చింది ఈ యంగ్ నటి. తనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని ఉందని అనుశ్రీ చెప్పుకొచ్చింది. అయితే రజాకార్ తన ఫస్ట్ మూవీ కాబట్టి అంత త్వరగా పెద్ద సినిమాల్లో ఛాన్స్ ఇవ్వరు గాని, చరణ్ సినిమాలో ఏ రోల్ ఇచ్చినా చేస్తానని చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే యంగ్ హీరోయిన్లలో రామ్ చరణ్ ఖాతాలో మరో అభిమాని చేరింది అని చెప్పవచ్చు.ఇక రజాకార్ చిత్రం మంచి టాక్ తో ప్రేక్షకాదరణతో థియేటర్ల వద్ద సందడి చేస్తుంది.

- Advertisement -

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే తాను హీరోగా దర్శకుడు శంకర్ తో చేస్తున్న మాసివ్ ప్రాజెక్ట్ “గేమ్ చేంజర్” వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ నెల 20న బుచ్చిబాబు తో సినిమా కూడా ప్రారంభమవుతుంది. అలాగే రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా సుకుమార్ తో కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ కానుంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ముందుగా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు