Reaction on audience: బాబీ సింహ కు ఎస్ జె సూర్యకు మధ్య ఉన్న తేడా ఇదే

Reaction on audience: ఒకప్పుడు సినిమాను వెతుక్కుంటూ ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లేవారు. కానీ ఇప్పటి కాలంలో సినిమా డైరెక్ట్ గా ఇంటికి వస్తుందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఒక సినిమాను చూడాలి అని అంటే ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉండేది. కానీ రీసెంట్ టైమ్స్ లో యాక్సిస్ ఎక్కువగా ఉండటం వలన సినిమా చూడటం మీద కూడా చాలామందికి ఆసక్తి తగ్గిపోయింది. ఏదో ఒక పెద్ద సినిమా వస్తే కానీ థియేటర్లో నిండటం లేదు. ఇకపోతే ప్రస్తుతం ఆడియన్స్ అంతా కూడా ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్నా కూడా సబ్ టైటిల్స్ పెట్టుకొని మరి ఆ సినిమాను చూసి అర్థం చేసుకుంటున్నారు.

Bobby Simha joins hands with Gopi Nainar | Tamil News - The Indian Express

ప్రస్తుతం ఆడియన్స్ అంతా తెలుగు తమిళ్ కన్నడ అని తేడా లేకుండా సినిమాలు చూడటం మొదలుపెట్టారు. అలానే ఇతర భాషల్లో ఉన్న నటులు కూడా తెలుగులో నటించడం కూడా మొదలుపెట్టారు. ఇక తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న బాబీ సింహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నా. ఇకపోతే రీసెంట్ గా శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ 2 సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఇండియన్ 2 సినిమా ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలోనూ, బయట ప్రేక్షకుల్లోనూ నెగిటివ్ టాక్ వినిపించింది. దీనిపై రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రియాక్ట్ అవుతూ ఈ సినిమాను మేము తెలివైన వాళ్ళ కోసం తీయలేదు అంటూ బాబి సింహ సమాధానమిచ్చాడు.

- Advertisement -

SJ Surya

ఇకపోతే ఎస్ జె సూర్య రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మామూలుగా నువ్వు ఎలా అయితే మిగతా సినిమాల్ని క్రిటిసిజం చేస్తావో అలానే మీ సినిమా కూడా క్రిటిసిజం వచ్చినప్పుడు తీసుకోవాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సూర్య విషయానికి వస్తే దర్శకుడుగా ప్రూవ్ చేసుకున్న తర్వాత ప్రస్తుతం నటుడిగా కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం సూర్య చెప్పిన ఈ స్టేట్మెంట్ ని బాబీ చెప్పిన స్టేట్మెంట్ తో కంపేర్ చేస్తూ వీళ్లిద్దరికీ ఉన్న తేడా గురించి చాలామంది సోషల్ మీడియా చర్చిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు