Neha Shetty : ఆ విషయంలో నేహా శెట్టి టాలెంట్ కి శభాష్ అనాల్సిందే!

Neha Shetty : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో “నేహా శెట్టి” ఒకరు. అప్పుడెప్పుడో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మెహబూబా అనే చిన్న మూవీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ గుర్తింపు తెచ్చుకుంది మాత్రం “డీజే టిల్లు” సినిమాతోనే. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో హీరో సిద్ధూ కి ఎన్ని మార్కులు పడ్డాయో, హీరోయిన్ నేహా శెట్టి కి కూడా అన్ని మార్కులు పడడం విశేషం. నెగిటివ్ టచ్ ఉన్న రోల్ అయినా, తన గ్లామర్ షో తో ఓ రేంజ్ లో ఆడియన్స్ ని మెప్పించింది. రీసెంట్ గా దీనికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ లో సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చే రాధికా ఎంట్రీ కి థియేటర్లో ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. కేవలం ఐదు నిమిషాలే కనిపించినా నేహా శెట్టి తన పెర్ఫార్మన్స్ తో సీక్వెల్ హిట్ కి కూడా కారణమైంది. అందుకే ఈ ఒక్క సినిమాతోనే యూత్ క్రష్ లిస్ట్ లో చేరిపోయిన నేహా శెట్టి ఎన్ని సినిమాలు చేసినా ముందు ఈ సినిమా గురించే మాట్లాడతారు. ఇదిలా ఉండగా నేహా శెట్టి లాస్ట్ ఇయర్ బెదురులంక తో హిట్ కొట్టగా, ఈ ఇయర్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి తో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయింది.

Recently Neha Shetty said she speaks 6 languages

వరుస ప్రమోషన్లతో బిజీ..

ఇక నేహా శెట్టి ఈ ఇయర్ లో టిల్లు స్క్వేర్ లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చి అదరగొట్టగా, తాజాగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలో హీరోయిన్ గా అలరించడానికి రెడీ అయింది. ఇక తాజాగా గా ఆ సినిమా రిలీజ్ కాగా, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. చిత్ర యూనిట్ తో కలిసి రెండు వారాలుగా నేహా శెట్టి వరుస ప్రమోషనల్లో సందడి చేస్తూ, ఇంటర్వ్యూ లలో బిజీ అవుతుంది. ఈ సినిమా హిట్ అయితే నేహా శెట్టి తెలుగులో మరిన్ని ఆఫర్లు అందుకోవడం ఖాయమని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా నేహా శెట్టి (Neha Shetty) ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఆ విషయంలో మల్టీ టాలెంటెడ్..

నేహా శెట్టి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. అందులో యాంకర్ మీరు బెంగుళూర్ కావడం వల్ల అక్కడ మల్టీపుల్ భాషలు మాట్లాడతారు కదా అని అంటే… దానికి నేహా శెట్టి అవునని సమాధానమిస్తూ, తన మాతృభాష “తుళు” అని సమాధానమిస్తూ, అలాగే కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలనని చెప్పుకొచ్చింది. అలాగే “కొడవ” భాషలో కూడా మాట్లాడతానంది. అంటే మొత్తం ఆరు భాషల్లో నేహా శెట్టి మాట్లాడగలదన్నమాట. అలాగే ఆ ఇంటర్వ్యూ లో త్వరలో తమిళ్ కూడా నేర్చుకోవాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక నేహా శెట్టి కి ఉన్న ఈ బహుభాషా ప్రావీణ్యత కి సోషల్ మీడియాలో శబాష్ అంటూ కితాబిస్తున్నారు నెటిజన్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు