Tollywood: ముగ్గురిలో తగ్గేదెవరు? నెగ్గేదెవరు..?

టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తోంది. ఈ కల్చర్ కు రాజమౌళి తెరలేపితే కార్తికేయ 2, సీతారామం వంటి సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో క్లిక్ అయ్యి చిన్న నిర్మాతలకు ఇన్స్పిరేషన్ గా నిలిచాయి. దీంతో 30కోట్ల మార్కెట్ కూడా లేని హీరోలు సైతం ఇప్పుడు 50కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ ఇండియా రిలీజ్ కు సిద్ధం అవుతున్నారు. ఇదే కోవకు చెందుతాడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, బోయపాటి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాని కూడా మేకర్స్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 20న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారని సమాచారం.

మరోవైపు వాల్తేరు వీరయ్య, ధమ్కీ చిత్రాల వరుస హిట్స్ తో ఊపు మీదున్న హీరో రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కూడా అక్టోబర్ 20న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేసారు మేకర్స్. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఇక్కడే కొత్త సమస్య వచ్చి పడింది. అదేంటంటే, బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కూడా ఇదే డేట్ కి రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేసారు మేకర్స్. ఈ మూడు సినిమాలు గనుక ఒకే డేట్ కి రిలీజ్ అయితే, కలెక్షన్స్ విషయంలో మూడు సినిమాలకు దెబ్బ పడే ఛాన్స్ ఉంది.

ఈ ముగ్గురిలో బాలకృష్ణ ఎలాగూ వెనక్కి తగ్గడు, ఇక రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావు కి రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ అయ్యారు కాబట్టి మేకర్స్ ఆ డేట్ ని వదులుకునే ఛాన్స్ లేదు. మొత్తం మీద సమస్య అంతా రామ్ – బోయపాటి ల సినిమాకే, దర్శకుడు బోయపాటి, బాలకృష్ణలకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి బాలయ్య కోసం బోయపాటి వెబెక్కి తగ్గే ఛాన్స్ ఉంది. మరి, ఈ ముగ్గురు హీరోల సినిమాల మధ్య ఏర్పడ్డ క్లాష్ ఎంతవరకు దారి తీస్తుంది?, రిలీజ్ డేట్ విషయంలో ఎవరు తగ్గుతారు?, ఎవరు నెగ్గుతారు?, అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు