Venu Swamy : హైకోర్టులో వేణు స్వామికి ఊరట… మహిళా కమిషన్ పై కోర్టు సీరియస్..

Venu Swamy : టాలీవుడ్ లో సెలెబ్రిటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయిన వేణు స్వామి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడన్న విషయం తెలిసిందే. నాగ చైతన్య ఎంగేజ్మెంట్ నుండి పీక్స్ కి చేరిన ఈ గొడవ నేడు అన్ని రకాల వ్యక్తులు టార్గెట్ చేసే విధంగా మారింది. కొన్ని రోజులుగా మీడియా నుండి కూడా వేణు స్వామిపై విమర్శలు వస్తుండగా, ఆ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. పైగా వేణు స్వామికి సపోర్ట్ గా అతని భార్య వీణ శ్రీవాణి కూడా వంత పాడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇకపోతే న్యూస్ ఛానల్స్ తో కూడా రీసెంట్ గా వివాదం పెంచుకున్నారు. ఇదిలా ఉండగా నాగ చైతన్య – శోభిత ధూళిపాళ మీద తప్పుడు జాతకాలు చెప్పారంటూ, వాళ్ళ ప్రైవసీ గురించి వేణు స్వామి తప్పుగా వ్యాఖ్యలు చేశాడంటూ వేణు స్వామి (Venu Swamy) పై మహిళా కమీషన్ కు ఓ ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Relief for Venu Swamy in the High Court

వేణు స్వామికి ఊరట..

నాగ చైతన్య- శోభిత ధూళిపాళ (Sobhitha Dhulipala) గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశాడంటూ వేణు స్వామి పై మహిళా కమీషన్ కు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ ఫిర్యాదు చేయగా, దీనిపై వేణు స్వామి వివరణ కోరుతూ మహిళా కమీషన్ నోటీసు జారీ చేసింది. అయితే ఈ నోటీస్ పై హైకోర్టు సింగిల్ బెంచ్ ను ఆశ్రయించాడు వేణు స్వామి. అక్కడ వేణు స్వామికి ఊరట లభించింది. వేణు స్వామి పై మహిళా కమీషన్ నోటీసులు చెల్లవంటూ హై కోర్ట్ తీర్పు ఇచ్చింది. పైగా వేణు స్వామికి నోటీసులు ఇవ్వడంపై మహిళా కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం చూపించిందని సమాచారం.

- Advertisement -

వాళ్ళకి లేని అభ్యంతరం మీకెందుకు..

ఇక మహిళా కమిషన్ నోటీసులు చెల్లవని హై కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు నాగచైతన్య (Naga Chaitanya) – శోభితా ధూళిపాలకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిర్యాదుదారులపై ,మహిళా కమీషన్ పై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నెట్టింట రకాలుగా చర్చ నడుస్తుంది. దాదాపుగా ఒకరి వ్యక్తిగత విషయాలపై చర్చ లేవదీసిన వేణుస్వామి దే తప్పంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇష్యూ ఇక్కడితో ఎండ్ అవుతుందా? లేదా మరింత ముదురుతుందా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు