Veturi SundaraRamamurthy Death Anniversary : నిత్య సాహిత్య స్మరణీయుడు మన వేటూరి..!

Veturi SundaraRamamurthy Death Anniversary : తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు “వేటూరి సుందరరామమూర్తి”. తెలుగు చిత్ర సీమ లో ఎందరో సాహిత్య రచయితలకు ఆయనే ఆదర్శం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక మహా అధ్యాయం “వేటూరి శకం”. ఎక్కడ పెద కళ్ళేపల్లి. ఎక్కడ తెలుగు సినీ పరిశ్రమ. ఈ తరం వారికి వేటూరి ఘనత గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 20వ దశకం ఆరంభం వరకు వేటూరి రచనా సాహిత్యం, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు చిత్ర పరిశ్రమ రుణపడి ఉండడం తప్ప ఏమి చేయలేదు. రాలిపోయే పువ్వు మీద రాగాలు పలికించి, తెలుగు ప్రేక్షకుడి హృదయాన్ని కరుణరసంలో ముంచెత్తి తెలుగుపాటకు జాతీయగౌరవం దక్కించిన ఘనాపాటి ఆయన. “కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు” అంటూ సందేశాత్మక గీతం ఇచ్చినా, ‘శంకరా నాదశరీరాపరా’..అంటూ ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంతో ముంచెత్తినా, “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు” అంటూ ప్రేమికులు పాడే యుగళగీతమైన వేటూరి కలం నుండి క్షణాల్లో జారువాలతాయంటారు. ఒకానొక దశలో ఆ తరం నటుల సినిమాల్లో వేటూరి పాటలు లేకపోతే అసంపూర్ణం గా భావించే వారు. అంతటి మహనీయుడు వేటూరి వర్ధంతి (మే22)నేడు. ఈ సందర్బంగా వేటూరిని (Veturi SundaraRamamurthy Death Anniversary) స్మరించుకుంటూ ఆయన సాహిత్యం నుండి జాలువారిన కొన్ని అద్భుతమైన పాటల్ని గుర్తుచేసుకుందాం..

ప్రేక్షకులకు అర్ధమయ్యేలా రాయడమే ఇష్టమట.!

కే. విశ్వనాధ్ తీసిన ఓ సీతకథ తో సినీరంగ ప్రవేశం చేసిన వేటూరి ఎన్నో పాటలతో తెలుగు సినీ సాహిత్య రంగాన్ని అలరించాడు. ఒక్కో పాట ఒక్కో డైమండ్ అన్నట్టు ఉంటుంది. అలా ఏకంగా ఎనిమిది నందులు ఆయన ఇంట్లో తిష్ట వేసాయి. నిజానికి ఆయనను గుర్తు చేసుకోవడానికి జయంతో, వర్ధంతో అవసరం లేదు. ఎందుకంటే ఆయన నిత్య స్మరణీయుడు కాబట్టి. ఆయన తన పాటలతో ప్రతీ రోజు మనల్ని పలకరిస్తూనే వున్నారు. వేటూరి సుందరరామమూర్తి తెలుగు సినిమా కోకిలమ్మకి పాటల పందిరి వేశారు. ఏ సందర్భానికైనా క్షణాల్లో ట్యూన్ కట్టే వేటూరి.. మాస్ అయినా.. క్లాస్ పాటలకు క్షణాల్లో మెరుగులు దిద్ది సినిమాకి మరింత బలాన్ని చేకూర్చేవారు. ఆయన పాటల్లో ఒక్కోసారి శ్రీశ్రీ మెరుపులు.. ఆత్రేయ విరుపులు కూడా కాకతాళియంగానే మనసులో మెదులుతాయి. పాటను సర్వాలంకార భూషితంగా తీర్చిదిద్దడంలో వేటూరి ఘనాపాటి. కాలంతో పాటే పాట నడకను మార్చడంలో ఆయనకెవ్వరూ సాటిలేరు. ప్రేక్షకులకు అర్ధమయ్యేలా పాటలు రాయడం ఇష్టమని ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు.

Remembering Veturi SundaraRamamurthy Death Anniversary

- Advertisement -

వేల పాటల్లో కోటి రాగాలు…

ఇక వేటూరి ఇప్పటివరకు సుమారు 5 వేలకి పైగా పాటల్ని రాయడం జరిగింది. అయితే విషాద గీతాలు రాయడంలో సిద్ధహస్తులైన వేటూరి కి అవార్డుల పంట ఇచ్చింది కూడా ఆ పాటలే కావడం విశేషం. ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకి, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, లాంటి ఇప్పటికి వింటూనే ఉంటాం. ఈ మధ్య ఏ సినీ, రాజకీయ ప్రముఖులు తాను చాలించినా ఈ పాటలే వేస్తారు. అలాంటిది వేటూరిని కూడా తెరపై అలా చూడాల్సి వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. తెలుగు కళామతల్లికి ఎన్నో సేవలు చేసిన వేటూరి సుందరరామమూర్తి 2010 లో మే 22న గుండెపోటు తో స్వర్గస్థులయ్యారు. అయినా వేటూరి తన పాటల రూపంలో ఎప్పటికి మనల్ని పలకరిస్తూనే ఉంటారు. ఇక వేటూరి పాటల్లో ప్రేక్షకులు అత్యంత ఇష్టపడే పాటలని కొన్ని గమనిస్తే..

వేటూరి రచనల్లో మచ్చుకు కొన్ని..

మేఘ సందేశం (1982) :

నిన్నటిదాకా శిలనైనా.. నీ పదముసోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా..

సాగర సంగమం (1982) :

నాదవినోదము నాట్యవిలాసము పరమసుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమపదము

గీతాంజలి.. (1989)

నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము…

గోదావరి (2006)

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదరి..

శుభలేఖ (1983)

రాగాల పల్లకిలో కోయిలమ్మా.. రాలేదు ఈవేళ ఎందుకమ్మా
రాలేదు ఈవేళ కోయిలమ్మా..రాగాలే మూగబోయినందుకమ్మా …

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు