Rihanna: అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో రిహాన్న పర్ఫామెన్స్ కి అన్ని కోట్లా..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనవంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ కుటుంబం గురించి.. వారి స్టేటస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. అయితే తాజాగా ఇంతటి ధనవంతుల ఇంటిలో అంబానీ వారసుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. రాధిక మర్చంట్ తో అనంత్ అంబానీ ఏడడుగులు వేయబోతున్నారు.. ఇక ఈ వివాహ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలను గెస్ట్ లుగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇకపోతే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లో గత మూడు రోజులుగా గ్రాండ్ గా జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి ఎంతోమంది వ్యాపార, సినీ , రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.

రిహాన్న పర్ఫామెన్స్..
నిన్న అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో బోలెడన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.. ఇందులో వరల్డ్ పాపులర్ పాప్ సింగర్ రిహాన్న కూడా ఇండియాకి వచ్చి అంబానీ ఇంట పెళ్లి వేడుకకు తన అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి అందరిని తన వైపు తిప్పుకుంది.. రిహాన్న పర్ఫామెన్స్ కి ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. ముఖ్యంగా ఇండియాలో కూడా ఈమె పాటలకు చాలామంది అభిమానులు కూడా ఉన్నారు.. ఇక అనంత్ అంబానీ , రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలలో రిహాన్న దాదాపు గంటసేపు పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక రిహాన్న పర్ఫామెన్స్ కు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రిహాన్న రెమ్యునరేషన్..
ఇకపోతే రిహాన్న పర్ఫామెన్స్ కి ముఖేష్ అంబానీ ఇచ్చిన రెమ్యునరేషన్ విని అందరూ ఆశ్చర్యపోతున్నారు.. రిహాన్నకి దాదాపుగా 9 మిలియన్ డాలర్స్ రెమ్యూనరేషన్ గా ఇచ్చినట్లు సమాచారం.. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు ఒక గంటకి రూ .74 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ రెమ్యునరేషన్ విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే అంబానీ ఇంట జరిగే వివాహ వేడుకకు దాదాపుగా రూ .1000కోట్లు ఖర్చు పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

సెలబ్రిటీల సందడి..
ఇకపోతే అంబానీ ఇంట జరగబోయే ఈ వివాహ వేడుకకు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సందడి చేయనున్నారు. వారిలో సల్మాన్ ఖాన్ , షారుక్ ఖాన్ కూడా తమ పర్ఫామెన్స్ తో వచ్చిన అతిథులను అలరించబోతున్నారని.. వారికి కూడా భారీగా పారితోషకం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రత్యేక ఆహ్వానం..
ఇకపోతే బాలీవుడ్ స్టార్ట్స్ కి ప్రత్యేక ఆహ్వానం అందగా.. టాలీవుడ్ నుంచి కేవలం రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసనకు మాత్రమే ఈ వివాహ వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రిక అందిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన హాజరు కాబోతున్నారు. ఇకపోతే ఇంత గొప్ప వివాహానికి కేవలం టాలీవుడ్ నుంచి వీరికి మాత్రమే ఆహ్వానం అందడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు