Remuneration: టాప్ 10 హీరోయిన్స్ వీళ్ళే..!

Remuneration:ఇండస్ట్రీలో కేవలం ఒకటి రెండు సినిమాలతోనే స్టార్డమ్ ను సంపాదించుకుంటున్నారు చాలామంది సెలబ్రెటీలు.. అలా భారీ హిట్లు పడ్డాయి అంటే చాలు అమాంతం రెమ్యూనరేషన్ ని కూడా పెంచేస్తూ ఉన్నారు. హీరోయిన్ల హవా కూడా ఎక్కువ కాలం కొనసాగదు.. వారికి అవకాశం ఉన్నప్పుడే రెమ్యూనరేషన్ ని పెంచేస్తూ భారీగానే సంపాదించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వివాహం చేసుకున్న తర్వాత అవకాశాలు ఎలాగో తగ్గుతూ ఉంటాయి. తాజాగా సౌత్ లో టాప్ టెన్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఒకసారి మన తెలుసుకుందాం. చాలామంది స్టార్ హీరోయిన్స్ సైతం ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతోనే ప్రేక్షకులను అలరించడానికి మక్కువ చూపుతున్నారు. అందుకే ఒక్కో సినిమాను చేయడానికి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరి సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న జాబితాలో టాప్ టెన్ లిస్టులో ఎవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

త్రిష:

కోలీవుడ్ , టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన త్రిష.. ప్రస్తుతం ఒకో చిత్రానికి రూ.10 కోట్లు.. రూ.12 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

- Advertisement -
Remuneration:They are the top 10 heroines
Remuneration:They are the top 10 heroines

నయనతార:

కోలీవుడ్ , టాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ నయనతార.. ఇటీవలే జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి 10 కోట్ల రూపాయల పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటోందట.

శ్రీ నిధి:

కే జి ఎఫ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ నిధి శెట్టి.. ఈమె కూడా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.. చివరిగా కోబ్రా సినిమాలో కనిపించిన ఈమె.. తెలుగు చిత్రం తెలుసు కదా లో సిద్దు జొన్నలగడ్డ , రాశీ ఖన్నాలతో కలిసి కనిపించనుంది.. ఇక ఈ సినిమా స్థాయిని బట్టి పారితోషకం కూడా డిమాండ్ చేస్తోంది. అంతేకాదు కిచ్చా సుదీప్ నటిస్తున్న తన 47వ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఈమె రూ.5కోట్ల రేంజ్ లో పారితోషకం తీసుకుంటోంది.

పూజా హెగ్డే:

ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. 2012లో అరంగేట్రం చేసిన ఈమె ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగింది.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 5కోట్ల పారితోషకం తీసుకుంటుంది.. ఇక చివరిగా 2023లో సల్మాన్ ఖాన్ తో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ లో నటిస్తోంది. ప్రస్తుతం షాహిద్ కపూర్ తో దేవా అనే సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రఖ్యాత మలయాళ దర్శకుడు రోషన్ అండ్ రూల్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అనుష్క శెట్టి:

దాదాపు రెండు దశాబ్దాల కెరియర్ లో తన అద్భుతమైన నట ప్రదర్శనలతో అభిమానులను నిరంతరం అలరించిన ఈమె ఒక్కో సినిమాకు రూ .7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది.

రష్మిక మందన్న:

గత ఎనిమిది సంవత్సరాలుగా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ .5కోట్లు వసూలు చేస్తోంది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ లో నటిస్తోంది. అలాగే ధనుష్, నాగార్జునలతో శేఖర్ కమ్ముల చిత్రం కుబేరాలో కూడా నటిస్తోంది..

ఇక వీరితోపాటు తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, సమంత లాంటి హీరోయిన్లు ఒక్కో సినిమాకు రూ .5కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు