Renu Desai: చాలా కష్టంగా ఉంటుంది.

రేణు దేశాయ్… తెలుగులో ఈమెకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ కన్నా రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ భార్యగానే బాగా తెలుసు. వీరి విడాకుల తర్వాత రేణు దేశాయ్ సినిమాలో నటించలేదు. తన పిల్లలని చూసుకుంటూ తన జీవితంలో బిజీ అయిపోయారు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో కనిపిస్తుండేవారు. రేణు దేశాయ్ ప్రస్తుతం “టైగర్ నాగేశ్వర్ రావు ” సినిమాతో మళ్ళి థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు.తాజాగా తన సోషల్ మీడియాలో తన ఆరోగ్య పరిస్థతి గురంచి సంచలన పోస్ట్ చేసింది.

రేణు దేశాయ్ పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్టు చెప్పుకొచ్చారు. “‘అందరికీ విషయం చెప్పాలనుకుంటున్నా. నేను గత కొన్నేళ్లుగా గుండె, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు, దీన్ని ఎదుర్కోవడానికి శక్తిని కూడగట్టుకునేందుకు, బలం తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాను. నేను మాత్రమే కాదు ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడే వారు అందరూ బలంగా ఉండాలని.. వారిలో ధైర్యం నింపేందుకే ఈ పోస్ట్ పెడుతున్నాను. ఎలాంటి కఠిన పరిస్థితులు ఉన్నాసరే ధైర్యం, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. అందరూ బలంగా నిలబడాలి. మనకు ఫలితం ఏదో ఓ రోజు వస్తుంది. అప్పటి వరకు నిరుత్సాహపడొద్దు. ఆశ కోల్పోవద్దు. మనపై మనకు నమ్మకం ఉంచాలి. అలాగే జీవితంతో కూడా నమ్మకంగా ఉండాలి. ఈ జీవితంలో మన కోసం ఎన్నో సర్‌ప్రైజులు వస్తాయి. అలా వచ్చే అన్ని సందర్భాలను పరిస్థితులను నవ్వుతూ ఎదుర్కొవాలి. నాకు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. మెడిసిన్స్‌ తీసుకుంటున్నాను. అలాగే యోగా చేస్తున్నాను. పోషకాహారం తీసుకుంటున్నాను. త్వరలోనే దీని నుంచి కోలుకుని మాములు మనిషిలా తిరిగొస్తాను” అని చెప్పుకొచ్చారు.

తాను గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు, దానికి చికిత్స తీసుకుంటున్నట్టు పోస్ట్ లో తెలిపింది. ఇంకా తన సుధీర్ఘ పోస్టులో చాలా విషయాలను వెల్లడించింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు