Renu Desai: ప్లీజ్ బియ్యం దానం చేయండి.. రిక్వెస్ట్ చేస్తూ రేణూ పోస్ట్ వైరల్..!

Renu Desai.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రోజుకొక సంచలన పోస్టుతో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం ఆర్థిక సహాయం చేయండి అంటూ చేసిన పోస్ట్ అప్పట్లో సంచలనం సృష్టించింది అయితే వెంటనే రియాక్ట్ అయ్యి దానిపై క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ బియ్యం దానం చేయండి అంటూ చేసిన పోస్ట్ మరొకసారి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెప్పవచ్చు. మరి రేణూ దేశాయ్ ఏ విషయాన్ని ఉద్దేశించి ఇలాంటి కామెంట్ చేసిందో ఇప్పుడు చూద్దాం.

Renu Desai: Please donate rice.. Renu's post viral requesting it..!
Renu Desai: Please donate rice.. Renu’s post viral requesting it..!

బియ్యం దానం చేయండి – రేణూ దేశాయ్

రేణూ దేశాయ్ జంతు ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పిల్లలకు, జంతువులకు తోచినంత సహాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటూ ఉంటుంది. అంతేకాదు అవసరమైనప్పుడు తన అభిమానులను కూడా విరాళాలు అడుగుతూ అనిమల్ లవర్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే పలు రకాల పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కుక్క పిల్లలకు డొనేషన్ గా రైస్ కావాలంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది రేణు దేశాయ్.

అర్జెంట్ రిక్వెస్ట్ అంటూ పోస్ట్..

అందులో భాగంగానే అర్జెంట్ రిక్వెస్ట్, మా కుక్కలకు రేషన్ బియ్యం కావాలి.. ఎవరైనా మాకు బియ్యం సహాయం చేయగలరా ? ప్రతి నెల మాకు 300 కేజీల బియ్యం అవసరం అవుతుంది. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ప్రభుత్వం నుండి 24 కేజీల బియ్యం అందుతుంది. కాబట్టి మీరు మాకు విరాళం ఇవ్వగలరా..? కనీసం అలా ఒక పది కుటుంబాలైన మాకు విరాళం ఇవ్వగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి మీ స్నేహితులు అలాగే బంధువులకు ఈ విషయాన్ని షేర్ చేయండి అంటూ వచ్చింది..

- Advertisement -

తన వంతు సాయంగా 50 కేజీల బియ్యం..

తాను తన వంతు సాయంగా ఒక 50 కేజీల బియ్యం కూడా ఇచ్చానని ఆ పోస్టులో తెలిపింది రేణూ దేశాయ్
.ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

రేణూ దేశాయ్ కెరియర్..

రేణూ దేశాయ్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ తరఫున నటించి అతడిని ప్రేమించి పెళ్లి చేసుకోకుండానే బిడ్డ (అఖీరా)కు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ కొడుకు సమక్షంలోనే వివాహం చేసుకున్న ఈమె ఆధ్యాకు జన్మనిచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నారు. రేణు దేశాయ్ మాత్రం ముంబైలో పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ.. ఇలా జంతువులకు, పేదవారికి అవసరమైన వాటిని తాను విరాళంగా ఇవ్వడమే కాకుండా అవసరమైతే అభిమానుల నుంచి కూడా ఇలా సోషల్ మీడియా పోస్ట్ తో అడుగుతూ వారికి సహాయాలు అందిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా రేణు దేశాయ్ గొప్ప మనసుకు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు