Renu Desai: సినిమా ప్లాప్ అవ్వడమే మంచిది ఇడియట్ రైటర్స్

Renu Desai: శంకర్(Shankar) దర్శకత్వంలో కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా నటించిన సినిమా భారతీయుడు 2. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా మామూలు అంచనాలను కూడా అందుకోలేకపోయింది. ఇకపోతే ఈ సినిమాని గత ఆరు సంవత్సరాలుగా తెరకెక్కించారు. ఈ సినిమాకి సంబంధించి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్లు చనిపోవడం కూడా జరిగింది.

ఇకపోతే శంక తీసిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. టీవీల్లో వచ్చిన ప్రతిసారి ఆ సినిమాకి మంచి టిఆర్పి రేటింగ్ నమోదు అవుతుంది. చాలామంది ఫ్యాన్స్ ఆ సినిమాకి ఉన్నారు. అటువంటి సినిమాకి సీక్వల్ గా వస్తుంది అని అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకి సీక్వల్ గా రిలీజ్ అయిన భారతీయుడు 2 రిలీజ్ ఆయన మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ సాధించింది. శంకర్ చాలామంది ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు.

Renu Desai

- Advertisement -

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మాజీ భార్య, దర్శకురాలు, నటి రేణు దేశాయ్ ఈ సినిమా గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ 2 సినిమాలోని ఒక వీడియో షేర్ చేసి, ఇది డిజాస్టర్ అవ్వాల్సిన సినిమానే, అసలు ఇడియట్ రైటర్స్ ఎలా రాస్తున్నారు ఇటువంటి డైలాగ్స్ అంటూ అసలు వాళ్లకు ఏమైంది అని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. ఇకపోతే పెట్స్ ని అమితంగా ప్రేమిస్తుంటారు రేణుదేశాయ్ అటువంటి పెట్స్ గురించి డైలాగ్స్ రాయడం అనేది రేణు దేశాయ్ ను ఆగ్రహానికి గురిచేసింది. ఇకపోతే ఇండియన్ టు సినిమాలోని ఏ వీడియో అయితే రేణు దేశాయ్ ను ఇబ్బంది పెట్టిందో ఆ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు