Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఇన్స్టాగ్రామ్ వాడడానికి కారణం ఇదే

Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో స్నేహం కాస్త ప్రేమగా మారి ఇద్దరు కలిసి ఏడు అడుగులు వేశారు. వీరిద్దరికీ అకీరా, ఆధ్యా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రేణు దేశాయ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని సినిమాల్లో కూడా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉండేది. రేణు దేశాయ్ ఒక సినిమాకు దర్శకత్వం కూడా చేశారు.పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా కాస్ట్యూమ్స్ కూడా రేణు దేశాయ్ డీల్ చేశారు. జానీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇకపోతే తల్లిదండ్రులు లక్షణాలు కొన్ని పిల్లలకు వస్తాయని చెబుతూ ఉంటారు. తన కుమారుడు అకీరా కు మంచి టాలెంట్ వచ్చింది. అకిరా నందన్ కు ఉన్నది మామూలు టాలెంట్ కాదు. మార్షల్ ఆర్ట్స్, మ్యూజిక్, ఎడిటింగ్ వీటన్నిటి పైన విపరీతమైన నాలెడ్జ్ అఖీరాకు ఉంది.

Renu Desai

- Advertisement -

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కి సంబంధించిన అన్ని విషయాలను ఇంస్టాగ్రామ్ వేదిక షేర్ చేస్తూ ఉంటుంది రేణు దేశాయ్.ఇకపోతే ఫేస్బుక్ ట్విట్టర్ లో కూడా ఒకప్పుడు యాక్టివ్ గా ఉండే వాళ్ళు రేణు కానీ వాటిని ప్రస్తుతం తొలగించారు. ఇంకా ఇన్స్టాగ్రామ్ విషయం గురించి మాట్లాడుతూ. చాలా ప్రమాదాలకు సంబంధించిన కేసులు, పిల్లలకు ఆహారం & మెడికల్ సపోర్ట్, కుక్కలకు వైద్యం అందించడానికి కొందరిని మేనేజ్ చేసేందుకు మాత్రమే ఇన్స్టా వాడుతున్నట్లు తెలిపారు. ఇన్స్టా అకౌంట్ను తొలగించలేనని, దీని ద్వారానే గత 10 రోజుల్లోనే కొన్ని పిల్లులు, కుక్కలను సేవ్ చేయగలిగినట్లు ఆమె వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు