Renudesai: అకీరా మొదటి సినిమా.. పోస్ట్ తో క్లారిటీ..!

Renudesai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 21 స్థానాల నుంచి పోటీ చేయగా.. జనసేన 21 స్థానాలలో గెలిచి విజయ ఢంకా మోగించింది.. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని.. ఎంతలా అంటే 70,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా హోం శాఖను ఎంచుకున్న విషయం తెలిసిందే.. ఇక ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మెగా ఇంట ఇప్పటికే వేడుకలు మొదలయ్యాయి.. తాజాగా అకీరా నందన్ కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు తండ్రి తో కలసి.. నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన అకీరా నందన్.. నేడు నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలుసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో అకీరా క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయిందని చెప్పాలి.

అకీరా సినిమా ఎంట్రీ..

Renudesai: Akira's first movie.. Clarity with the post..!
Renudesai: Akira’s first movie.. Clarity with the post..!

ఇకపోతే ఇటీవలే తన తండ్రి విజయం గురించి ఆసక్తికరమైన పోస్ట్ కూడా చేశారు అకీరా నందన్.. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ అకీరా ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు అభిమానులు..నిజానికి అకీరానందన్ కి సినిమాల మీద కంటే మ్యూజిక్, ఎడిటింగ్ మీదే ఆసక్తి ఎక్కువ.. గతంలో కూడా అకీరానందన్ తల్లి రేణూ దేశాయ్ కూడా ఇవే విషయాలను చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఈ ప్రశ్నలకు మరోసారి ఆమె సోషల్ మీడియా ఖాతా ద్వారా సమాధానం తెలిపింది..

సినీ ఎంట్రీ పై రేణూ క్లారిటీ..

అకీరాకు తానే మొదటి ఫ్యాన్ అని ఒక ఆసక్తికరమైన జవాబు ఇచ్చిన రేణూ దేశాయ్.. నన్ను అర్థం చేసుకోండి.. అకీరా పుట్టినప్పటి నుండి నేనే తన మొదటి అభిమానిని. తాను ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు అని నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. కానీ ఒక తల్లిగా తన నిర్ణయానికి కూడా నేను గౌరవం ఇవ్వాలి కదా.. అందుకే తాను ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు అంటూ నన్ను అడిగి ఇబ్బంది పెట్టవద్దు ప్లీజ్ అంటూ అకీరాతో ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ పోస్ట్ చేసింది రేణూ దేశాయ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి.. మరి కొంతమంది నటన ఫీల్డ్ లోకి రాకపోయినా మ్యూజిక్, ఎడిటింగ్ అంటూ ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంది కదా.. కనీసం ఇలాగైనా సరే సినిమాల్లో ఉంటే చాలు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.. మొత్తానికైతే అకీరా నందన్ నటన రంగంలోకి రాడు అని క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్ చూద్దాం భవిష్యత్తులో తండ్రిలాగే మొదట వద్దని మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ ఇస్తాడేమో..

- Advertisement -

పవన్ కళ్యాణ్..

ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం హోం శాఖ మంత్రిగా త్వరలోనే పదవి స్వీకారం కూడా చేయబోతున్నారు.. మరి అధికారంలోకి రాబోతున్న వీరు ఐదేళ్ల పరిపాలనలో ఇటు ప్రజలకు, అటు రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధిని చేకూరుస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు