Renudesai: ఆ నరకం కంటే పవన్ కళ్యాణ్ చాలా బెటర్.. ఉండి కూడా లేనట్టే..!

Renudesai.. ప్రముఖ హీరోయిన్ , కాస్ట్యూమ్ డిజైనర్ రేణూ దేశాయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమె వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక నరకప్రాయం అని చెప్పాలి. పుట్టిన సమయంలో కష్టాలు, తల్లిదండ్రులు ఉన్నా సరే ఆ ప్రేమకు నోచుకోలేదు. ఇక పెళ్లయిన తర్వాత భర్తకు దూరమయింది. ఆయన ప్రేమ కొంతకాలానికి విషం గా మారి ఆయన కూడా దూరమైపోయాడు. అలా తల్లిదండ్రుల ప్రేమ దక్కక, భర్త ఆదరాభిమానాలు ఎలా ఉంటాయో తెలియక , ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటుంది రేణు దేశాయ్. ప్రస్తుతం సమాజ సేవ చేస్తూ తన ఇద్దరి పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయంపై స్పందించే ఈమె తాజాగా తన జీవితంలో జరిగిన కష్టాలను కూడా చెప్పుకొని కంటతడి పెట్టుకుంది. ఇక తన తల్లిదండ్రుల దగ్గర పడిన నరకం కంటే పవన్ కళ్యాణ్ దూరమైనప్పుడు వచ్చిన బాధ చాలా తక్కువ అని తెలిపింది. రేణు దేశాయ్..

Renudesai: Pawan Kalyan is much better than that hell.. even if he is not there..!
Renudesai: Pawan Kalyan is much better than that hell.. even if he is not there..!

దేవుడి దయతో నన్ను చంపలేదు..

ఒక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ.. మా అమ్మ నాన్నలు ముందుగా మగపిల్లాడే జన్మిస్తారనే నమ్మకంతో ఉన్నారట. నేను పుట్టడంతో మా తల్లిదండ్రులు పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు. మా నాన్న అయితే నేను పుట్టిన తర్వాత అసలు నన్ను చూడడానికి రాలేదు. ఏకంగా మూడు రోజుల వరకు ఆయన నా ముఖమే చూడలేదు.సాధారణంగా కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయిలు పుట్టిందని చంపేస్తున్నారు. కానీ మా పేరెంట్స్ చదువుకున్న వారు కాబట్టి నన్ను చంపలేదు అంటూ ఎమోషనల్ గా కామెంట్లు చేసింది రేణు దేశాయ్..

అమ్మ ప్రేమను పొందకపోవడం నరకం..

అమ్మలేని వారి కంటే తల్లి ఉండి కూడా ఆమె ప్రేమను పొందలేకపోవడం నరకం అంటూ వెల్లడించింది. ఇంట్లో ఉన్న పనిమనిషి తనను అల్లారుముద్దుగా చూసుకునేదట. పవన్ కళ్యాణ్ తో డివోర్స్ తీసుకున్న బాధ కంటే పుట్టింట్లో తల్లిదండ్రుల ఆదరణ ఉండకపోవడం మరింత బాధ కలిగించిందని ఒకరకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా బెటర్ అని కూడా పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ కామెంట్లు చేసింది రేణు దేశాయ్. ఇకపోతే రేణు తన లాంటి పరిస్థితి మళ్లీ తన పిల్లలకు రాకూడదని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నానని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఆ వ్యక్తితో పెళ్లి క్యాన్సిల్..

ఇకపోతే పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత ఒక వ్యక్తితో ఈమె నిశ్చితార్థం చేసుకుంది. కానీ పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది . ఇక దాంతో ఆ వ్యక్తితో కూర్చొని మాట్లాడిన తర్వాత పరస్పర అంగీకారంతోనే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది రేణూ దేశాయ్. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లికి ముందు తల్లిదండ్రుల ప్రేమ పొందలేక నరకం చూసిన రేణు దేశాయ్ పెళ్లయిన తర్వాత భర్త ప్రేమకు నోచుకోకుండా ఎన్నో అవస్థలు పడుతోందని చెప్పవచ్చు. ఏది ఏమైనా రేణుదేశాయ్ బాధ వర్ణనాతీతం అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు