Kalki2898AD : కల్కిపై వస్తున్న ఆ రూమర్లు అవాస్తవమట!

Kalki2898AD : ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కల్కి2898AD ఎట్టకేలకు థియేటర్లలో రేపు విడుదల కాబోతుందన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ దాకా ఈ సినిమాపై మూవీ లవర్స్ ఎన్నో భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్లు నటించడం జరిగింది. అదొక్కటే కాకుండా ఈ సినిమా టీజర్ మొదలుకుని, ట్రైలర్ ఇంకా సాంగ్స్ కూడా సినిమాపై విపరీతమైన బజ్ ని పెంచేసాయి. అందుకే కల్కి కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక బుక్ మై షో లో కల్కి టికెట్స్ అందుబాటులోకి వచ్చాక కొన్ని గంటల పాటు ఆ సైట్ పని చేయకుండా ఆగిపోయిందంటేనే అర్ధం చేసుకోవచ్చు కల్కి కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో. ఇదిలా ఉండగా కల్కి సినిమా కోసం థియేటర్ల వద్ద ఇప్పటికే అభిమానులు బారులు తీరారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి నిన్నటి నుండి ఓ రూమర్ తెలుగు రాష్ట్రాల్లో తెగ ట్రెండ్ అవుతుంది. అయితే తాజాగా దీని గురించి క్లారిటీ వచ్చింది.

Reports circulating about SrNTR's as Lord Krishna in Kalki2898AD are untrue

కల్కిపై వస్తున్న ఈ వార్తల్లో నిజం లేదట..

ఇక కల్కి (Kalki2898AD) సినిమా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా, ఈ సినిమాకి మైథాలజీ టచ్ కూడా ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్ర చుట్టూ మైథాలజీ డ్రామా కథ ఉంటుంది. దాదాపు సినిమాల అరగంట పాటు మహాభారతానికి సంబంధించిన కథ ఉంటుందట. అయితే ఈ పార్ట్ లో సీనియర్ ఎన్టీఆర్ ని AI టెక్నాలజీ విఎఫ్ఎక్స్ వాడి కృష్ణుడి పాత్రలో నటింపచేస్తున్నారని వార్తలు వచ్చాయి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ ని కూడా ఇందులో భాగం చేసారని వార్తలు వచ్చాయి. నిన్న సాయంత్రం నుండి ఈ వార్త ట్రెండ్ అవుతుంది. కానీ తాజా సమాచారం ప్రకారం, కల్కి2898ADలో శ్రీకృష్ణుడుగా సీనియర్ NTR ఉన్నాడని ప్రచారంలో ఉన్న కథనాలు అవాస్తవమని, అందులో ఎంత మాత్రం నిజం లేదని సమాచారం వచ్చింది. అంతే కాదు కల్కి లో శ్రీ కృష్ణుడి పాత్రను తెలుగులో ఏ నటుడూ పోషించడం లేదట. బహుశా ఇతర ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ ఎవరైనా ఉండొచ్చని అంటున్నారు.

- Advertisement -

అల్ టైం రికార్డ్స్ ఓపెనింగ్ లోడింగ్?

ఇక కల్కి సినిమా ఇప్పటికే అన్ని చోట్ల ప్రీమియర్స్ తో సహా రికార్డులు సెట్ చేసుకుంటూ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తుంది. ఓవర్సీస్ లో ఇప్పటికే RRR ప్రీమియర్స్ రికార్డ్ బ్రేక్ అవగా, తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల బుకింగ్స్ దాటిపోయాయట. ఇక మొదటి రోజు ఈ సినిమాకి 200 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ప్రభాస్ సహా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ తారాగణం తో పాటు, యంగ్ స్టార్స్ అయిన నాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి వాళ్ళు కూడా ఈ సినిమాలో నటించారు. అయితే వాళ్ళ పాత్రలకు సంబంధించి డైరెక్టర్ గా థియేటర్లో చూసి థ్రిల్ అవ్వాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. మరి రేపు థియేటర్లలో కల్కి ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు