Revathi: నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అదే.. నటి రేవతి షాకింగ్ కామెంట్స్..!

Revathi.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ఎంతోమందిని అలరించిన నటి రేవతి ఇప్పటికీ పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఈమె అసలు పేరు “ఆశా కేలున్ని”. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే ఈమె పేరు “రేవతి”గా మార్చుకుందట. మొదట భారతీ రాజా డైరెక్షన్లో వచ్చిన మణ్ వాసనై అనే తమిళ చిత్రం ద్వారా మొట్టమొదటిసారి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ అందుకున్నది. అలా అతి తక్కువ సమయంలోనే మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ వంటి భాషలలో కూడా నటించి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నది.

తల్లి క్యారెక్టర్స్ తోనే అలరించిన రేవతి..

Revathi: That was the biggest mistake I made in my life.. Actress Revathi's shocking comments..!
Revathi: That was the biggest mistake I made in my life.. Actress Revathi’s shocking comments..!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మాత్రం నరసింహారావు డైరెక్షన్లో వచ్చిన మానసవీణ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వర్మ తెరకెక్కించిన గాయం చిత్రంలో కూడా తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషలలో కూడా తనకు తగ్గ పాత్రలలో నటిస్తూ మెప్పించింది రేవతి. ఎక్కువగా అమ్మ క్యారెక్టర్లలో నటిస్తోంది నటి రేవతి నటిగానే కాకుండా డైరెక్షన్ లో కూడా మంచి పట్టు ఉందట.

పెళ్లి తర్వాత ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరం.

నటి రేవతి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం గురించి.. తన రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా పలు విషయాలను తెలియజేసింది.. రేవతి మాట్లాడుతూ.. తాను చిన్న వయసులోనే నటిగా తన కెరీయర్ ను ప్రారంభించానని.. అలా ప్రారంభించిన మూడు సంవత్సరాలు.. అంటే 20 ఏళ్ల వయసులోనే తను వివాహం చేసుకున్నానని తెలిపింది. వివాహమైన తర్వాత ఒక సంవత్సరం పాటు సినిమాలకు దూరం అయింది.. కేవలం అడపా దడపా సినిమాలలో నటించినా..అవేవీ తనకు పెద్దగా పేరు తీసుకురాలేదని తెలిపింది.

- Advertisement -

వివాహమే నా సినీ కెరీర్ ని డామేజ్ చేసింది..

వివాహం చేసుకున్న తర్వాత ఎక్కువ సినిమాలు వదిలేసుకోవలసి వచ్చింది.. అప్పుడే పెళ్లి చేసుకొని తప్పు చేశానని పించింది అంటూ కూడా తెలియజేసింది.. అప్పుడు వివాహం వైపు ఆలోచించకుండా కెరియర్ పరంగా ఆలోచించి ఉంటే ఇంకాస్త బెటర్ గా ముందుకు వెళ్లేదాన్నేమో అన్నట్టుగా తెలిపింది రేవతి. ఎన్నో మంచి చిత్రాలు చేసి వివాహం చేసుకొని ఉంటే తన లైఫ్ మరోలాగా ఉండేది అన్నట్లుగా తెలియజేసింది నటి రేవతి. మొత్తానికైతే వివాహం వల్లే తన సినీ కెరియర్ డామేజ్ అయిందని చెప్పుకొచ్చింది రేవతి. ప్రస్తుతం రేవతి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇకనైనా ఆచితూచి అడుగులు వేస్తూ.. మంచి కథలను సెలెక్ట్ చేసుకుని పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎలాగో అతి తక్కువ సమయంలోనే వివాహం చేసుకొని సినీ కెరియర్ ను నాశనం చేసుకున్న ఈమె.. ఇప్పుడైనా అవకాశాలను ఒడిసి పట్టుకొని సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. మరి నటి రేవతి తన కెరీర్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు