RGV : వర్మ అరాచకానికి 26 ఏళ్ళు… అది ఓ బిగ్ షూట్ అవుట్

RGV:  రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ వర్మ. అసలు ఎవరి గురించే పట్టించుకోకుండా ఎవరో ఏమో అనుకుంటారని కాకుండా తనకు నచ్చిన విధంగా తన కోసం తాను మాత్రమే బ్రతుకుతారు ఈ వ్యక్తి. విమర్శలకైనా, అతనిపై చేసే ట్రోలింగ్ కైనా సరే ఆయన చెప్పే సమాధానంతో ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎప్పటికప్పుడు తాను వేసే పంచ్ డైలాగ్స్ తో కాంట్రవర్సీగా మారుతూనే ఉంటారు.

ఇక ఈ కాంట్రవర్సీ డైరెక్టర్ తనకు మద్యం, శృంగారం, అమ్మాయిలు అంటేనే అన్నిటికన్నా ఎక్కువగా ఇష్టం అని ఓపెన్ గా అందరి ముందు చెబుతూనే ఉంటాడు. ఇక అలా చెప్పడం మాత్రమే కాదు. ఆయన ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది. తనకు నచ్చిన అందమైన అమ్మాయిలతో కలిసి ఎంజాయ్ చేయడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలలో పోస్ట్ చేసి ప్రతి ఒక్కరికి షాక్ ఇవ్వడం ఆర్జీవికి అలవాటు అయిపోయింది.

Image

- Advertisement -

 

ఇక ఆయన దగ్గర ఉండే కొంతమంది హీరోయిన్లు నైనా గంగూలీ, అప్సర రాణి వంటి వారితో ఆర్జీవి మందు కొడుతూ, చిందులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఇక వీరి మీద సోషల్ మీడియాలో ఎన్నో రకాల కామెంట్స్ వచ్చినప్పటికీ వాటిని అస్సలు పట్టించుకోరు. ఇక ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరికి నచ్చింది వారు చేయొచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా ఆర్జీవి ఏదో ఒక రకంగా పోస్టులు పెడుతూనే ఉంటారు.

ఇక మరికొందరేమో అక్కడి కామెంట్ బాక్స్ లను దారుణమైన కామెంట్లతో నింపుతూ ఉంటారు. ఇక వాటిని పట్టించుకోడు ఆర్జీవి. ఇక ఇదిలా ఉండగా….ఆర్జీవి కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక తాను దర్శకత్వం వహించిన సత్య సినిమా రిలీజ్ అయ్యి 26 సంవత్సరాలు అవుతుంది. ఈ తరుణంలోనే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిగ్‌ షాట్‌ అంటూ ఈ పోస్ట్‌ర్‌ పై రాసుకొచ్చారు వర్మ. ఈ సినిమాలో చక్రవర్తి, మనోజ్ బాజ్‌పేయి
నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ అందుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు