Richest Heros: రూ.7 వేల కోట్లతో షారుక్ మొదటి స్థానం.. బన్నీ , విజయ్ ల స్థానం..?

Richest Heros.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ దేశంలోనే అత్యంత సంపన్న యాక్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక్క ఆయన ఆస్తులు విలువే సుమారుగా రూ.7వేల కోట్లు ఉంటుంది. అంతేకాదు బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల జాబితాలో ఈయన కూడా ఒకరు. మరి షారుక్ ఖాన్ ఆస్తుల విలువ ఇంత ఉంటే.. మరి రజినీకాంత్, అల్లు అర్జున్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, విజయ్ తదితరులు అత్యధిక పారితోషకం తీసుకుంటూ ఫోర్బ్స్ రిచెస్ట్ యాక్టర్స్ – 2024 జాబితాలో చోటు సంపాదించుకున్నారు. మరి ఎవరి ఆస్తి ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.

Richest Heros: Shahrukh is the first place with Rs. 7 thousand crores.. Bunny and Vijay's position..?
Richest Heros: Shahrukh is the first place with Rs. 7 thousand crores.. Bunny and Vijay’s position..?

సల్మాన్ ఖాన్..

బాలీవుడ్ లో కండల వీరుడుగా భారీ పాపులారిటీ దక్కించుకున్న సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడే కాదు అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరో కూడా.. ఈయన సంపద విలువ రూ.2,900 కోట్లు. ఇక ఈయన నటించిన టైగర్ 3 సినిమా విజయవంతంగా థియేటర్లలో నడుస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.466.63 కోట్లు వసూలు చేసింది.

- Advertisement -

అక్షయ్ కుమార్:

ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హాస్య చిత్రాలతో పాటు సామాజిక నేపథ్యం ఉన్న చిత్రాలలో కూడా నటిస్తూ ఉంటారు. ఇక ఈయన ఆస్తి విలువ సుమారుగా రూ .2,500 కోట్లు.. ఇదిలా ఉండగా 2023లో ఈయనకు పెద్దగా హిట్స్ లేవనే చెప్పాలి.కానీ ఓ ఎం జి 2 లో గెస్ట్ పాత్రలో నటించగా ఈ సినిమా రూ.221 కోట్లు వసూలు చేసింది.

అమీర్ ఖాన్:

మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెప్పించుకున్న అమీర్ ఖాన్ సంపద రూ.1862 కోట్లు. పలు సినిమాలలో హీరోగా నటించడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు అయితే ఈయన నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని అందించలేదు. అయితే దంగల్, పీకే వంటి చిత్రాలు మాత్రం భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఏడాది త్వరలోనే సితారే జమీన్ పర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

దళపతి విజయ్ :

జోసెఫ్ విజయ్ దళపతి విజయ్ గా పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే. దక్షిణాదికి చెందిన ఈయన రూ.474 కోట్లు సంపాదించారు. ఇక 2023లో ఈయన నటించిన వరిసు రూ .300 కోట్లు రాబట్టగా .. లియో రూ.612 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఒక 2023లో తమిళ సినిమా పరిశ్రమలో అత్యధికంగా వసూలు చేసిన సినిమాగా లియో రికార్డు సృష్టించింది.

రజనీకాంత్..

తమిళ్ సూపర్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న రజినీకాంత్ ఆస్తులు విలువ రూ.430 కోట్లు. తమిళ్, తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా నటిస్తూ భారీ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈయన సౌత్ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. సాధారణంగా బస్ కండక్టర్గా ఉన్న రజినీకాంత్ సినీ పరిశ్రమలు అడుగుపెట్టి సూపర్ స్టార్ గా ఎదిగారు. ఇక ప్రస్తుతం వెట్టయాన్ అనే చిత్రంతో త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానున్నారు.

అల్లు అర్జున్:

ప్రముఖ హీరో అల్లు అర్జున్ కెరియర్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు అంతే కాదు పుష్ప సినిమాలో నటించి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఈయన ఆస్తి విలువ రూ.350 కోట్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు