Kalki2898AD : నిర్మాతల ప్లాన్ మామూలుగా లేదు భయ్యా… మరో స్టార్ ని దింపారు

Kalki2898AD :పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ కళ్ళు ఇప్పుడు ‘కల్కి2898AD’ సినిమాపైనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు. కల్కి సినిమా టిక్కెట్స్ బుక్ చేస్తుంటే, ఆ వేగానికి బుక్ మై షోనే స్ట్రక్ అయి ఆగిపోయిందంటే అర్ధం చేసుకోవచ్చు కల్కి మేనియా ఏ రేంజ్ లో ఉందొ. ఇక ప్రభాస్ నటించిన కల్కిలో పాన్ ఇండియా వైడ్ గా దాదాపు అన్ని ఇండస్ట్రీలకి సంబంధించిన నటులు ఉండడం వల్ల ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ మధ్య ప్రమోషన్లు సరిగా చేయడం లేదని నిరాశలో ఉన్న అభిమానులు, ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. కల్కి కి సంబంధించి టీజర్, ట్రైలర్లతో సహా, మేకింగ్ వీడియోలు , ఇంటర్వ్యూలు అన్నీ సినిమాపై ఓ రేంజ్ అంచనాలను పెంచేసాయి. ఇక కల్కి ప్రమోషన్ల కోసం దీపికా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ ప్రమోషన్లకి హాజరవడం విశేషం. ఇదిలా ఉండగా కల్కి కోసం అన్ని భాషల్లోనూ భారీగా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. ప్రభాస్ ఇప్పుడు వెకేషన్ లో ఉన్నా, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మాత్రం ఆగట్లేదు. తాజాగా కల్కి (Kalki2898AD) కోసం మరో స్టార్ ని రంగం లోకి దింపారు.

Rishabh Shetty promoted the movie Kalki 2898 AD

కల్కి కోసం కాంతార…

ఇక కల్కి సినిమా ప్రమోషన్ల కోసం ఒక్కో ఇండస్ట్రీ నుండి ఒక్కో హీరోని దించుతున్నారు చిత్ర యూనిట్. ఇక తెలుగులో ప్రభాసే పెద్ద ప్రమోషన్, కాబట్టి అవసరం లేదు. హిందీలో ఇప్పటికే బిగ్ బి అమితాబ్, దీపికా పదుకొనె తమ వంతు ప్రమోషన్ చేసారు. ఇక తమిళ్ లో కమల్ హాసన్ ఉండనే ఉన్నాడు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ తో ప్రమోషన్లు చేయించే అవకాశం ఉంది. అయితే కన్నడ ప్రమోషన్స్ ఎవరు చేస్తారా అనుకుంటున్న తరుణంలో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టిని రంగంలోకి దించారు. కాంతారా సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా లిమిటెడ్ బడ్జెట్ తో ఆ సినిమాని కన్నడ నేటివిటీతో తెరకెక్కించి పాన్ ఇండియా సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు కల్కి సినిమాలో భైరవ అసిస్టెంట్ బుజ్జితో రిషబ్ శెట్టి చేత ప్రమోట్ చేయించారు. చిత్ర యూనిట్ బుజ్జి కారును రిషబ్ శెట్టి దగ్గరికి తీసుకెళ్లగా ‘కుందాపుర ఊరులో తాను బుజ్జి కార్ ని నడుపుతున్నట్టు వీడియోతో పోస్ట్ చేసారు.

- Advertisement -

కల్కి టీం కి స్పెషల్ విషెస్…

ఇక రిషబ్ శెట్టి కాంతారా టీం కి స్పెషల్ విషెస్ చెప్తూ, రిషబ్ శెట్టి వీడియో పోస్ట్ చేసాడు. కల్కి వాహనం బుజ్జి చాలా బాగుందని, ఆ బండిని నడపడం మంచి ఫీల్ ని అందించిందని రిషబ్ చెప్పుకొచ్చాడు. అలాగే కల్కి టీం కి ముందుగానే శుభాకాంక్షలు చెప్తూ, జూన్ 27న సినిమాని థియేటర్లలో చూడండంటూ మూవీ లవర్స్ కి చెప్పుకొచ్చాడు. ఇక కల్కి లో ప్రభాస్ సహా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని, బ్రహ్మానందం, మాళవిక నాయర్, పశుపతి, శోభన తదితరులు కీలకపాత్రల్లో నటించగా, నాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లు గెస్ట్ అప్పీరెన్స్ లు కూడా ఇస్తున్నారని టాక్. అయితే వీళ్ళ పాత్రలపై సినిమా చూస్తే కానీ క్లారిటీ రాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు