Rithu Chowdhary: విష్ణు ప్రియ ఎక్స్ తో రీతూ చౌదరి.. పబ్లిక్ లో దారుణం..!

Rithu Chowdhary.. ఒకప్పుడు పలు సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక గుర్తింపు దక్కించుకున్న రీతూ చౌదరి ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టి అక్కడ లేడీ కమెడియన్ గా పేరు సంపాదించుకుంది. ఇప్పుడు యాంకర్ గా పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ తెగ సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. అంతేకాదు కాస్త సమయం దొరికిందంటే చాలు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ లేపుతూ ఉంటుంది. ఇక యూట్యూబ్లో కూడా సొంతంగా ఛానల్ నిర్వహిస్తున్న రీతూ చౌదరి తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

Rithu Chowdhary: Rithu Chowdhary with Vishnu Priya's ex.. Atrocious in public..!
Rithu Chowdhary: Rithu Chowdhary with Vishnu Priya’s ex.. Atrocious in public..!

విష్ణుప్రియ , రీతూ చౌదరి బెస్ట్ ఫ్రెండ్స్.. కానీ..

అసలు విషయంలోకెళితే ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ.. రీతూ చౌదరి ఇద్దరూ మంచి స్నేహితులు.. వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉండటమే కాదు కలసి విందులు చేయడం, విహారాలకు వెళ్లడం లాంటిది చేస్తూ ఉంటారు. ఇప్పటికే వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్న ఎన్నో ఫోటోలు, వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఇంస్టాగ్రామ్ లో వెకేషన్ ఫోటోలు పంచుకున్న సందర్భాలు కూడా ఎన్నో. ఇద్దరికీ గ్లామర్ ఇమేజ్ ఉంది ఒకరిని మించి మరొకరు బోల్డ్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతూ ఉంటారు.. అయితే వీరిద్దరూ చేసే స్కిన్ షో పైన ఎప్పటికప్పుడు విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ఇంస్టాగ్రామ్ ఆదాయ మార్గంగా మారిన తరుణంలో గ్లామర్ షో చేస్తూ .. ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు వీరు.. ఇదిలా ఉండగా వీరిద్దరికి సంబంధించిన ఎఫైర్ రూమర్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి..

శ్రీకాంత్ తో ఎఫైర్..

అసలు విషయంలోకెళితే రీతూ చౌదరి ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లు.. ఆ వ్యక్తి పేరు శ్రీకాంత్ అని.. అతడితో దిగిన ఫోటోలు కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. వీరిద్దరు వివాహం చేసుకుంటారు అని ప్రచారం జరిగేలోపే బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో చాట్ లో కూడా రీతూ చౌదరి బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ ని దూరం పెట్టినట్లు పరోక్షంగా కామెంట్లు పెట్టింది. అయితే నేను సింగిల్ అని చెప్పిన ఈమె.. కొద్ది రోజులకే మళ్లీ శ్రీకాంత్ తో కనిపించింది
.ఆ వ్యక్తితో రిలేషన్ లో ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు విష్ణు ప్రియ మాజీ లవర్ తో ఈమె ఎఫైర్ నడుపుతోందనే వార్త హాట్ టాపిక్ గా మారింది..

- Advertisement -

విష్ణు ప్రియ ఎక్స్ తో రీతూ చౌదరి..

అసలు విషయంలోకెళితే.. శ్రీముఖి యాంకర్ గా కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ షోలో.. రీతూ చౌదరి , అనసూయ, విష్ణు ప్రియ, శోభా శెట్టి , ప్రియాంక జైన్ పాల్గొన్నారు.. ఈ షోలో కాలేజ్ థీమ్ తో ఒక స్కిట్ చేశారు. అందులో రీతూ చౌదరి తన బాయ్ ఫ్రెండ్ కి లవ్ లెటర్ రాసి అందరి ముందు చదివింది.”నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక షాపింగ్ మానేస్తా.. ఎందుకంటే నీ బట్టలు నేను ధరించాలి.. నీకోసం చేసే కాఫీ తోనే నా రోజు మొదలవ్వాలి”.. అని తన లవ్ లెటర్ లో రాసింది రీతూ చౌదరి.. దీంతో “మీ వాడికి కాఫీ అలవాటు లేదు కదా” అని విష్ణు ప్రియ..రీతూ చౌదరితో అంది..” మా వాడికి కాఫీ అలవాటు లేదని.. నీకు ఎలా తెలుసు..?” అని రీతు చౌదరి అడిగితే.. దానికి విష్ణు ప్రియ..” ఎందుకంటే.. నీకంటే ముందు నేను ప్రేమించాను కాబట్టి”.. అని హాట్ బాంబు పేల్చింది. ఇది చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా షో కోసం చేశారా? లేకపోతే నిజంగానే విష్ణు ప్రియ ఎక్స్ తో రీతూ చౌదరి ఇప్పుడు ప్రేమాయణం కొనసాగిస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు