Avengers Doomsday : మార్వెల్ ఫ్యాన్స్ కి సాలిడ్ న్యూస్… రాబర్ట్ డౌనీ మళ్ళీ వచ్చేస్తున్నాడు..

AvengersDoomsday : హాలీవుడ్ మూవీ లవర్స్ కి మార్వెల్ మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల కింద హాలీవుడ్ ని ఒక ఊపు ఆపేసిన సినిమాలు ఆ ఫ్రాంఛైజెస్ నుండి వచ్చాయి. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, బ్లాక్ పాంథర్, అవెంజర్స్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్ ఎండ్ గేమ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. అయితే ఈ సిరీస్ లో చాలా మంది ఆడియన్స్ కి ఇష్టమైన హీరో రాబర్ట్ డౌనీ. ఐరన్ మ్యాన్ గా పాపులర్ అయిన ఈ హీరో మొన్నటివరకు కూడా అత్యధిక పారితోషకం తీసుకునే హీరో కూడా. కానీ అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా తర్వాత మార్వెల్ మూవీస్ లో సినిమాలు ఆపేసాడు. ఎందుకంటే ఆ సినిమాలో ఐరన్ మ్యాన్ పాత్రని ఎండ్ చేసేసారు. ఆ సినిమాలో ఐరన్ మ్యాన్ పాత్రని అలా ఎండ్ చేయడం ఎంతో మంది మూవీ లవర్స్ కి బాధ కలిగించింది. మళ్ళీ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ మార్వెల్ మూవీస్ లో చూడలేమని అనుకున్నారు అభిమానులు. కానీ లేటెస్ట్ గా రాబర్ట్ డౌనీ ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మార్వెల్ మేకర్స్.

Robert Downey is making a re-entry in Avengers Doomsday

మళ్ళీ వచ్చేస్తున్న రాబర్ట్ డౌని..

ఇక అవెంజర్స్ సిరీస్ లో చాలా ధీటైన పాత్ర ఐరన్ మ్యాన్ అంటారు. ఎందుకంటే మార్వెల్ సిరీస్ లో అందరికి సూపర్ పవర్స్ అనుకోకుండా వస్తే.. ఐరన్ మ్యాన్ మాత్రం తనే కష్టపడి వెపెన్స్ తయారు చేసుకొని ఒక సూపర్ హీరోలా ట్రాన్స్ ఫార్మ్ అవుతాడు. అందుకే ఈ పాత్రకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండగా, ఈ పాత్రకి ఎవెంజర్స్ లో ఎండ్ చేసి షాకిచ్చారు. కానీ ఇప్పుడు ఐరన్ మ్యాన్ హీరో రాబర్ట్ డౌనీ మళ్ళీ మర్వెల్ మూవీస్ లో కనిపించనున్నాడు. కానీ ఐరన్ మ్యాన్ గా కాదు.. డూమ్స్ డే అనే పాత్రలో రాబర్ట్ కనిపించనున్నాడట. ‘ఎవెంజర్స్: డూమ్స్‌డే- ఎవెంజర్స్: సీక్రెట్ వార్స్ పేరుతో త్వరలో రానున్న ఎవెంజర్స్ మూవీస్‌ సిరీస్ లో రాబర్ట్ డౌనీ నటిస్తున్నాడు.

- Advertisement -

సూపర్ విలన్ గా రాబర్ట్ డౌనీ…

అయితే రాబర్ట్ డౌనీ రాబోయే మార్వెల్ మూవీస్ లో మల్టీవర్స్ టైమ్‌లైన్‌ లో ఈ సూపర్ హీరో హీరోగా కాకుండా సూపర్‌ విలన్ గా డాక్టర్ డూమ్‌ గా కనిపిస్తాడట. ఇక ఈరోజు కొన్ని గంటల కిందే మార్వెల్ మేకర్స్ ఈ ప్రకటన చేసారు. ఇక అవెంజర్స్ లో మళ్ళీ వస్తున్నట్టు, రాబర్ట్ డౌనీ జూనియర్ వేదికపైకి వచ్చి తన ముసుగును తొల‌గించ‌గానే అభిమానులు థ్రిల్ కి గుర‌య్యారు. ఇక ఈ కొత్త అవెంజర్స్ సినిమాలు వరుసగా ఎవెంజర్స్: డూమ్స్‌డే- మే 2026లో , ఎవెంజర్స్: సీక్రెట్ వార్స్ మే 2027లో అధికారికంగా విడుదల కానున్నట్టు సమాచారం. ఇక ఐరన్ మ్యాన్ మూవీ లవర్స్ కి ఇది సూపర్ న్యూస్ అని చెప్పాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు