RobinHood: వేరే ఛాన్స్ లేదు నితిన్ వెనక్కి తగ్గాల్సిందే

Robin Hood: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లో నితిన్ ఒకరు. జయం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. తర్వాత చేసిన దిల్, సై వంటి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయ్యాయి. అయితే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా తర్వాత దాదాపు హిట్ సినిమా పడడానికి ఒక పదేళ్లు కాలం పట్టింది. విక్రం కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమాతో మళ్లీ మంచి కం బ్యాక్ ఇచ్చాడు నితిన్. ఇష్క్ సినిమా ఆడియో లాంచ్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు.

ఇష్క్ సినిమా ఆడియో లాంచ్ లో పవన్ కళ్యాణ్ కి నితిన్ ఎంత పెద్ద అభిమాని అని మాట్లాడుతూ మొత్తం ప్రేమను చూపించాడు. అక్కడితో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా నితిన్ కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా మంచి హిట్ సినిమాలు అందుకున్నాడు నితిన్. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత కూడా నితిన్ లాంటి మిడ్ రేంజ్ హీరోతో సినిమా చేయటానికి పవన్ కళ్యాణ్ కారణం.

Telugu film actor Nithin likely to join BJP.

- Advertisement -

ఇక నితిన్ కెరీర్ కి హిట్ సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. వెంకీ కుడుముల దర్శకుడుగా చేసిన భీష్మ సినిమా తర్వాత ఇప్పటివరకు సరైన హిట్టు నితిన్ కెరియర్ లో పడలేదు. మళ్లీ ఆ స్థాయి హిట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు అదే దర్శకుడు వెంకి కుడుముల. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ఇప్పుడు రాబిన్ హుడ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు డిసెంబర్ నెలలో అనూహ్యంగా గేమ్ చేంజర్ కూడా రానుంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు కాబట్టి కచ్చితంగా నితిన్ వెనక్కి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమాను 2025 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారి ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు