Kalki2898AD : సేనాపతి తాత దెబ్బేసాడు.. భైరవ పుంజుకున్నాడు..

Kalki2898AD : రెండు వారాల కింద భారీ అంచనాలతో కల్కి2898AD సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. జూన్ 27న విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ యానానిమస్ గా మంచి టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ ఇప్పటికి థియేటర్లలో దూసుకుపోతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాని నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ తారాగణం నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్ల వసూళ్లు అందుకోగా రెండు వారాలు పూర్తయ్యాక కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమా సందడి తగ్గాక ఈ వారం ఇండియన్2 సినిమా విడుదలైంది. కమల్ హాసన్ నటించిన ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా రెండో పార్ట్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకుల వద్ద నుండి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది.

Rocking collections for Kalki2898AD in the third weekend as well

దెబ్బేసిన సేనాపతి.. పుంజుకున్న భైరవ..

అయితే భారీ అంచనాలతో జులై 12న కమల్ హాసన్ నటించిన ఇండియన్2 రిలీజ్ అయింది. తెలుగులో భారతీయుడు2 పేరుతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హైప్ వల్ల ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వచ్చినా, రెండో రోజుతో డీలా పడింది. స్క్రీన్ ప్లే లోపం వల్ల, ల్యాగ్ సీన్ల వల్ల అంచనాలను అందుకోవడం వల్ల సేనాపతి తాత దెబ్బేసాడు. అయితే అనూహ్యాంగా కల్కి వసూళ్లు ఇప్పుడు పెరుగుతున్నాయి. రెండు వారాల తర్వాత కల్కి కలెక్షన్లు తగ్గిపోగా, భారతీయుడు2 నిరాశపరచడంతో మూడో వీకెండ్ లో కూడా కల్కి కలెక్షన్లలో పుంజుకుంటున్నాడు. నిన్న శనివారం వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు2 కంటే కల్కి కి ఎక్కువ వసూళ్లు రావడం విశేషం. అలాగే ఆదివారం వీకెండ్ లో కూడా భైరవ జోరు చూపిస్తున్నాడు.

- Advertisement -

ఇండియన్2 ఇక గో బ్యాకేనా?

అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ఇండియన్2 సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరచగా, ఆడియన్స్ కూడా సినిమాని ఎంకరేజ్ చేయడంలో దెబ్బేసారు. శంకర్ సినిమాలకు వచ్చే స్థాయిలో ఈ సినిమాకు ఓపెనింగ్స్ రాలేదని చెప్పాలి. ఇక ఇండియన్2 రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా కేవలం 87 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది అని చెప్పాలి. భారతీయుడు2 కి జరిగిన బిజినెస్ తో కంపేర్ చేస్తే ఇవి చాలా తక్కువ ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఇక ఇండియన్2 గో బ్యాక్ అని నెట్టింట కామెంట్స్ వస్తుండగా, వారం రోజుల్లోనే థియేటర్లలోంచి సినిమా తీసేసేలా పరిస్థితి ఉందని చెప్పాలి. ఇక ఇదే ఊపులో కల్కి మరో 50 కోట్ల వరకు పిండుకోవచ్చని అంటున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు