Rolls Royce: ఆర్థిక సమస్యలు.. ఖరీదైన కార్ ను అమ్మకానికి పెట్టిన స్టార్ హీరో..?

Rolls Royce.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారును అమ్మకానికి పెట్టారు.. ఈ విషయం తెలిసి సెలబ్రిటీలు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన ఈ కారును ఎందుకు అమ్మకానికి పెట్టారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Rolls Royce: Financial problems.. Star hero who put expensive car for sale..?
Rolls Royce: Financial problems.. Star hero who put expensive car for sale..?

రోల్స్ రాయిస్ కార్ ను అమ్మకానికి పెట్టిన విజయ్..

2012లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రోల్స్ రాయిస్ కార్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఆ కారు కోసం అప్పట్లో లీగల్ సమస్యలను కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఆ కారు కోసం అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఈయన ఇప్పుడు ఉన్నట్టుండి దానిని అమ్మకానికి పెట్టడంతో తమిళనాట హాట్ టాపిక్ గా మారింది . సుమారు రూ .2.6 కోట్లకు విజయ్ ఈ కారును అమ్మనున్నట్లు ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్ షిప్ ఒక వీడియోని తాజాగా విడుదల చేసింది.

అసలు కారణం ఏంటంటే..?

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న నేపథ్యంలో అభిమానులు , సెలబ్రిటీలు కూడా ఎందుకు ఈ కారును అమ్మడానికి పూనుకున్నారు అంటూ ప్రశ్నిస్తూ ఉండగా.. ఇందుకు సంబంధించిన ఒక వార్త కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం విజయ్ పార్టీని పెట్టిన విషయం తెలిసిందే.వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని కూడా తెలిపాడు. ఇప్పుడు ఆ పార్టీని ముందుకు నడిపించాలి అంటే డబ్బు కావాలి సినిమాల ద్వారా వచ్చే డబ్బు సరిపోవట్లేదని , ఆ కారణంగానే కారును అమ్ముతున్నారేమో అంటూ అభిమానులు ఊహాగానాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొంతమంది రాబోయే తన సినిమా కోసం ఏకంగా రూ.250 కోట్ల పారితోషకం తీసుకుంటున్న విజయ్ కి కేవలం 2కోట్ల రూపాయలు లెక్క కాదు. అసలు కారు అమ్మడానికి ఇంకేదో కారణం ఉంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఆయన ఏ కారణం చేత ఆ కార్ ను అమ్ముతున్నారో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

- Advertisement -

విజయ్ కెరియర్..

విజయ్ కెరియర్ విషయానికొస్తే, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఇక ఈయన గత ఏడాది తెలుగులో నేరుగా చేసిన చిత్రం మాస్టర్. ఈ సినిమా బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకునే విజయ్ ఇప్పుడు చివరిగా ఒక సినిమా చేసి ఆ తర్వాత పూర్తిగా తన జీవితాన్ని రాజకీయాలకే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే పార్టీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీ ద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చి ప్రజాపాలన చేయాలని ఆయన ఆశిస్తున్నారు. మరి ఏ మేరకు ఆయన కలలు నెరవేరుతాయో తెలియాల్సి ఉంది. మొత్తానికైతే సినిమాలలో వాళ్లంతా రాజకీయాల్లో సక్సెస్ అవుతారన్న రూల్ ఏమి లేదు. మరి విజయ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉందో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు