Rolls Royce : కాస్ట్లీ కారు రోల్స్ రాయిస్ ఉన్న ఇండియన్ సెలబ్రిటీస్ వీళ్లే

Rolls Royce : ప్రపంచంలోనే బిగ్గెస్ట్ పెళ్లిగా జరుగుతున్న అనంత్, అంబానీ రాధిక మర్చంట్ ల వివాహానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు తమ కొత్త రోల్స్ రాయిస్ స్పెక్ట్రమ్ కారులో వెళ్ళడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్లో ఇంతటి ఖరీదైన కారు ఉన్న సెలబ్రిటీలు ఎవరు? అసలు ఇండియాలో ఈ రోల్స్ రాయిస్ కారు ఎంతమంది సెలబ్రిటీల దగ్గర ఉంది? అనే విషయాలను ఆరా తీస్తున్నారు నెటిజెన్లు.

రోల్స్ రాయిస్ కారు ఉన్న సెలబ్రిటీలు వీళ్లే…

రోల్స్ రాయిస్ అనేది అత్యంత కాస్ట్లీ కారు. కోట్లతో వ్యవహారం కాబట్టి ఎంత సెలబ్రిటీలైనా అందరూ ఈ కారును కొనలేరు. మరి ఈ లగ్జరీ కారును కొన్న అతి తక్కువ మంది సెలబ్రిటీగా లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు అంటే.. ముందుగా చెప్పుకోవాల్సింది బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి. ఆయన దగ్గర 3.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. అక్షయ్ కుమార్ దగ్గర 10 కోట్ల రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెగాస్టార్ చిరంజీవి దగ్గర 9 నుంచి 10 కోట్ల విలువైన రోల్ రాయిస్ ఫాంటమ్, ఆది గోద్రెజ్ దగ్గర 8.8 కోట్ల రోల్స్ రాయిస్ పాంటమ్, శివ నాడర్ దగ్గర 12 కోట్ల రోల్స్ రాయిస్ ఫాంటమ్, యోహన్ పూనావాలా వాళ్ళ దగ్గర 13 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్, షారుక్ ఖాన్ దగ్గర 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూప్ మోడల్ కారు, ప్రభాస్ స్టార్ ప్రభాస్ దగ్గర 8 నుంచి పది కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్లు ఉన్నాయి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సెలబ్రిటీలు అందరి దగ్గర ఆల్మోస్ట్ ఫాంటమ్ మోడల్ ఉండడం విశేషం.

ఇక ఇక్కడి నుంచి రోల్స్ రాయిస్ లోనే ఇతర సిరీస్ కార్లు ఉన్న సెలబ్రిటీలు ఎవరో చూద్దాం. అమీర్ ఖాన్ దగ్గర 6.83 కోట్ల రోల్స్ రాయిస్ ఘోస్ట్, మాన్యా దత్ దగ్గర 6.95 కోట్ల రోల్స్ రాయిస్ ఘోస్ట్, ప్రియాంక చోప్రా దగ్గర 5.2 కోట్ల రోల్స్ రాయిస్ ఘోస్ట్, తలపతి విజయ్ దగ్గర 8 కోట్ల రోల్స్ రాయిస్ ఘోస్ట్, పరాస్ గుప్తా దగ్గర 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2, హృతిక్ రోషన్ 7 కోట్ల రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2, బాలీవుడ్ రాపర్ బాద్షా దగ్గర 6.4 కోట్ల రోల్స్ రాయిస్ వ్రయిత్, డైరెక్టర్ శంకర్ దగ్గర 3.45 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, రామ్ చరణ్ దగ్గర 7.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కార్లు ఉన్నాయి.

- Advertisement -

ప్రభాస్ టూ రామ్ చరణ్.. పరభాషా దర్శకులతో పని చేస్తున్న హీరోలు వీళ్లే.. – News18 తెలుగు

సౌత్ లో 5 మంది స్టార్స్ దగ్గరే…

సౌత్ ఇండస్ట్రీలో ఈ కార్లు ప్రభాస్, డైరెక్టర్ శంకర్, విజయ్, చిరంజీవి, రామ్ చరణ్ దగ్గర మాత్రమే ఉన్నాయి. వీటిలో ఆల్మోస్ట్ ప్రభాస్, చిరంజీవి దగ్గర ఉన్న కార్ల ధర 10 కోట్ల దాకా ఉంటుంది. అయితే రామ్ చరణ్ దగ్గర ఉన్న స్పెక్ట్రా మోడల్ కారు మాత్రం దేశంలోనే ఇద్దరి దగ్గరే ఉంది. చెర్రీ కంటే ముందే యువరాజ్ అనే ఇండియన్ వ్యక్తి దగ్గర ఈ కారు ఉండగా, ఇప్పుడు చెర్రీ గ్యారేజ్ లో కూడా చేరింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు