Roshan Kanakala: రోషన్ – తేజస్వీ మధ్య ఇంత బాండింగ్ వుందా..పోస్ట్ వైరల్..!

తేజస్వీ మదివాడ.. ఈ బోల్డ్ బ్యూటీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె మొదట హీరో , హీరోయిన్ లకి ఫ్రెండ్ క్యారెక్టర్ లో , చెల్లెలు క్యారెక్టర్ లో నటించి బాగా ఆకట్టుకుంది.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఫామ్ లోకి వచ్చిన ఈమె రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ చిత్రంతో బోల్డ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ ప్రయాణం..
ఇక బిగ్ బాస్ రెండవ సీజన్ కి వెళ్ళిన తర్వాత తేజస్వీ ఇమేజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. షో నుంచి పూర్తి నెగిటివిటీతో బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షో వల్లే అవకాశాలు కోల్పోయానని చెప్పుకొచ్చింది..ఇకపోతే బిగ్ బాస్ తర్వాత తేజస్వీకి ఏ సినిమా ఆఫర్లు కూడా వచ్చినట్టుగా..అందుకు ఆమె అంగీకరించినట్టుగా కనిపించడం లేదు. అంతేకాదు బిగ్ బాస్ ఓటీటీ లోకి కూడా తేజస్వీ మళ్ళీ వచ్చింది. రెండవ సీజన్ కి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కి తేజస్వీ లో చాలా మార్పు వచ్చింది.. ఇక్కడ చాలా శాంతంగా, మంచిగా మారి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఓటీటీ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత పూర్తి పాజిటివ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఇక దీంతో తేజస్వీ కి బుల్లితెరపై మంచి అవకాశాలు కూడా వచ్చాయి.. డాన్స్ షోలో కూడా సందడి చేసింది.. అలా కెరియర్ ప్రశాంతంగా సాగుతున్నట్లుగా కనిపిస్తోంది.

రోషన్ తో బాండింగ్..
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోషూట్ లతోపాటు నెటిజెన్స్ ను ఆకట్టుకునే రకరకాల ఫోటోలతో , వీడియోలతో అలరిస్తూ ఉంటుంది.. ఈ క్రమంలోనే నిన్న సుమా కొడుకు రోషన్ కనకాల పుట్టిన రోజు సందర్భంగా ఆమె విషెస్ చెబుతూ షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.. సుమ కొడుకు రోషన్ కనకాలను వెనుక నుంచి పట్టుకున్నట్టు తేజస్వీ షేర్ చేసిన ఫోటో అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు వీరిద్దరి మధ్య ఇంత బంధం ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. తాజాగా తేజస్వి పోస్ట్ చేస్తూ.. బ్రదర్ ఫ్రం అనదర్ మదర్ అంటూ ఒకే తల్లికి పుట్టకపోయినా సొంత సోదరుడు లాంటివాడు అంటూ రోషన్ మీద ఈమె వేసిన పోస్ట్ అందరిని ఆకట్టుకుంటుంది.. అంతేకాదు హ్యాపీ బర్త్ డే అని తేజస్వీ చెప్పిన విషెస్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది..

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

- Advertisement -

రోషన్ కనకాల..
ఇక రోషన్ కనకాల విషయానికి వస్తే… బబుల్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. అర్జున్ రెడ్డి రేంజ్ లో సినిమాను తీయాలనుకున్నారు.. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించలేదు.. దీంతో థియేటర్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. మొత్తానికి అయితే మొదటి సినిమాతోనే డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు రోషన్ కనకాల. మరి నెక్స్ట్ సినిమా కథతో ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు